మేష రాశి (Aries): ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. దగ్గర బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సత్ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి.
వృషభ రాశి (Taurus): ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ధనలాభసూచనలున్నాయి. ఆర్థిక ప్రయత్నాలకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారం పెళ్లికి దారితీస్తుంది.డబ్బు నష్టపోతారు జాగ్రత్త.
మిథున రాశి (Gemini): ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం బాగుంది. కీలక విషయాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించండి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. పెళ్లి సంబంధం ఖాయం చేసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కర్కాటక రాశి (Cancer): ఉద్యోగం మారడం మంచిదనే అభిప్రాయానికి వస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వీలైనంతగా దుబారాను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి వ్యాపారులకు, స్వయం ఉపాధివారికి అన్నివిధాలా బాగుంది. స్పెక్యులేషన్ జోలికి పోవద్దు.
సింహ రాశి (Leo): ఉద్యోగంలో మార్పు చోటు చేసుకుంటుంది. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. స్నేహితులు అపార్థం చేసుకునే సూచనలున్నాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.
కన్య రాశి (Virgo): ఉద్యోగంలో మీ ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపుగా అదనపు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారులు అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు.
తుల రాశి (Libra): ఉద్యోగంలో సహోద్యోగులతో విభేదాలు తలెత్తుతాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. దూరపు బంధువులు కలిసే అవకాశం ఉంది. వ్యాపారులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. పొదుపు చర్యలు అవసరమవుతాయి.
వృశ్చిక రాశి (Scorpio): ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సహోద్యోగులు, సన్నిహితుల నుంచి సహకారం ఉంటు౦ది. అనుకున్న పనులు పూర్తవుతాయి. అన్నివిధాలా సమయం అనుకూలంగా ఉంది. అనారోగ్యం ను౦చి బయటపడతారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఎవరికీ డబ్బు ఇవ్వొద్దు, తీసుకోవద్దు.
ధనస్సు రాశి (Sagittarius): ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. అదనపు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారుల మీద ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. మధ్య మధ్య అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి. దగ్గరవారికి ఆర్థికంగా సహాయపడతారు.
మకర రాశి (Capricorn): ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అదాయం నిలకడగా ఉంటుంది. కానీ, ఖర్చులు అదుపు తప్పుతాయి. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. వ్యాపారులకు శ్రమ ఎక్కువ రాబడి తక్కువ అన్నట్టుగా ఉంటుంది. స్పెక్యులేషన్ ఏమాత్రం లాభించదు.
కుంభ రాశి (Aquarius): ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతుంటాయి. ఇంటా బయటా చికాకులు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు, స్వయం ఉపాధి రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆదాయం పరవాలేదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. స్పెక్యులేషన్ లాభించకపోవచ్చు.
మీన రాశి (Pisces): ఉద్యోగంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది.పొదుపు చర్యలు అవసరమవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. శుభవార్త ఒకటి ఊరట కలిగిస్తుంది. ఇష్టపడినవారితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారులకు ఆర్థికంగా పెద్దగా ఎదుగుదల ఉండకపోవచ్చు.