Astrology: జ్యోతిష శాస్త్రం చాలా విశేషమైనది. అందులో ఎన్నో అంశాలకు ఆచారాలు, విధానాలూ ఉన్నాయి. మనం ఏ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలి అనే దానిపైనా ఈ రూల్స్ ఉన్నాయి. థాయిలాండ్, కంబోడియా ప్రజలు ఈ డ్రెస్ కలర్స్ తప్పక పాటిస్తారు. జ్యోతిష శాస్త్ర పండితులు చెప్పినట్లుగా... ఒక్కో రోజుకు ఒక్కో రకమైన కలర్ డ్రెస్ వేసుకుంటే... అదృష్టం కలిసివస్తుందట. పచ్చ నోట్లు క్యూ కట్టి మరీ వస్తాయట. (Photo Source: Collected)
Sunday: హిందూ పురాణాల ప్రకారం ఆదివారం... సూర్య భగవానుడిది. ఆ స్వామికి ఎరుపు రంగు అంటే ఇష్టం. అందువల్ల ఆదివారం ఎరుపు రంగు బట్టలు వేసుకోవాలి. మహిళలకు రెడ్ కలర్ డ్రెసెస్ ఉంటాయి. పురుషులకు రెడ్ ప్యాంట్స్ లేకపోయినా... షర్ట్ అయినా రెడ్ కలర్ది వేసుకోవాలని పండితులు చెబుతున్నారు. (Photo Source: Collected)
Monday: వారంలో మొదటిరోజు మహా శివుడిది. ఈ రోజున భక్తులు... ముక్కంటికి తెల్లటి పూలతో పూజలు చేస్తారు. అందువల్ల స్వామికి ప్రీతి పాత్రమైన తెల్లటి వస్త్రాలను సోమవారం ధరించాలి. సోమవారం చందమామ రోజు కూడా. అందువల్ల తెలుపు, పసుపు, సిల్వర్, లైట్ గ్రే లేదా బ్లూ కరర్ డ్రెస్సులు వేసుకోవచ్చు. (Photo Source: Collected)