Astrology: ఈ 3 రాశుల వారిపై హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం.. ఏ కష్టమూ రానీయడట
Astrology: ఈ 3 రాశుల వారిపై హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం.. ఏ కష్టమూ రానీయడట
Astrology: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారిపై హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందట. ఆంజనేయుడి ఆశీస్సులు ఉన్న వారికి జీవితంలో ఎలాంటి కష్టమూ రానీయదట. మరి ఆ రాశులేంటి? అందులో మీరు ఉన్నారేమో ఇక్కడ తెలుసుకోండి.
హిందూ మత విశ్వాసాల ప్రకారం.. మంగళవారం హనుమంతుడికి అంకితమైనది. ఈ రోజున హనుమంతుడిని పూజించి, ఉపవాసం పాటించడం ద్వారా ఆనందం, శ్రేయస్సు పొందుతారు. దీంతో పాటు కష్టాల నుంచి విముక్తి లభిస్తుందన్న నమ్మకం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
హనుమంతుడిని నిత్యం పూజించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తగ్గుతాయి. సానుకూల ఫలితాలు లభిస్తాయి. కుటంబంలో సుఖ సంతోషాలు వెల్లవిరుస్తాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. హనుమంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండే కొన్ని రాశులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
కుంభం (Aquarius): కుంభ రాశి వారికి వారికి ఎల్లప్పుడూ హనుమంతుడి మద్దతు లభిస్తుంది. ఏ పని తలపెట్టినా విజయం వరిస్తుంది. ధనలాభాలు కూడా ఉంటాయని నమ్ముతారు. తద్వారా ఆర్థిక పురోగతి సాధిస్తారట. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
వృశ్చికం (Scorpio): వృశ్చిక రాశి వారికి కూడా ఆంజనేయుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మంగళవారం నాడు హనుమంతుడిని పూజించడం వల్ల ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. అదే విధంగా ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
సింహం (Leo): సింహరాశిని హనుమంతునికి ఇష్టమైన రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి వారిపై బజరంగబలి ప్రత్యేక ఆశీస్సులు ఉన్నాయి. ఈ రాశి వారు ఏ పని చేసినా.. హనుమంతుని దయతో వారు ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. వీరి కష్టాలన్నింటినీ ఆయన తొలగిస్తాడట. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం హనుమంతుడికి సంబంధించిన రోజు. ఈ రోజున పూజించడం వల్ల హనుమాన్ అనుగ్రహం లభిస్తుంది. మంగళవారం హనుమాన్ చాలిసా, సుందరకాండను పఠించాలి. బేసన్ లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)