Surya Rashi Parivatan 2022 July: సూర్య భగవానుడు ప్రతి నెలా ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవశిస్తూ ఉంటాడు. ఈ రకంగా రవి ఒక రాశి నుంచి మరోకొ రాశిలోకి మారడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. ప్రతి యేడాది 12 సంక్రాంతులుంటాయి. ఈ నెలలో సూర్యుడు జూలై 16న మిథునం నుంచి కర్కాటక రాశిలోకి మారతాడు. అప్పటి నుంచి ఉత్తరాయణం పోయి.. దక్షిణాయణం ప్రవేశిస్తోంది. సూర్య గ్రహ రాశి పరివర్తనం మూలంగా ఈ మూడు రాశుల వారి జీవితంలో కొన్ని శుభాలు కలిగిస్తాడు.
మేషరాశి : సూర్య భగవానుడు కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మేషరాశి వారకి అనుకూల ఫలితాలుంటాయి. సూర్యుడు.. మేషరాశికి 10వ స్థానంలో ఉంటోంది. పైగా మేషరాశికి సూర్యుడుకు ఉచ్ఛం కాబట్టి ఈ రాశివారు ఉద్యోగం ప్రమోషన్ పొందే అవకాశలున్నాయి. కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారులు గత కొంత కాలంగా చూస్తోన్న అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మేష రాశి వారికి పట్టిందల్ల బంగారం అన్నట్టు వచ్చే ఆగష్టు 15 వరకు ఉంటోంది.
వృషభ రాశి: సూర్య కర్కాటక సంక్రమణం కారణంగా వృషభ రాశి వారి జీవితాల్లో సంతోషం వెల్లివిరిస్తోంది. పైగా కర్కాటక రాశి వారికి సూర్యుడు 11వ ఇంట లాభ స్థానంలో ఉండటం వలన మంచి ఫలితాలను అందిస్తాడు. ఈ రాశుల వారికి ఆదాయంలో పెరుగుదల ఉంటోంది. ఉద్యోగులు తాము చేసే స్థానాన్ని వదిలి వేరే కంపెనీలోకి మారడానికి ఇది మంచి శుభ సమయం. వ్యాపారస్థులకు లాభాలు కలిగే అవకాశాలున్నాయి.
మిథున రాశి : రవి కర్కాట రాశిలోకి మారడం వల్ల మిథున రాశి వారికి ఎంతో ప్రయోజన కారంగా ఉంటోంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు జూలై నెలలో మంచి ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి గుర్తింపు లాభాలుంటాయి. నిపుణులైన ఉద్యోగులు ప్రమోషన్‌తో తమ ఆదాయన్ని పెంచుకోవచ్చు. సంపద వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. స్టాక్ మార్కెట్స్‌తో పాటు మిగతా వాటిలో పెట్టుబడులు పెట్టుటకు ఇది మంచి అనుకూలమైన సమయం. (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)