అక్టోబర్ 23న శనిదేవుడు మకరరాశిలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని యొక్క మార్గం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. జూలైలో, శని దేవుడు మకరరాశిలో వక్రం చెందారు. అక్టోబర్ 23న శని దేవుడు మకరంలో ప్రవేశించిన నేపథ్యంలో జనవరి 17న 2023 వరకు ఈ రాశుల వారు అప్రమత్తతో వ్యవహరించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
శని పేరు వింటేనే భయం వేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడు ఒక ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. శని గ్రహ సంచారం చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే శని ఒక రాశి నుండి మరొక రాశికి చేరుకోవడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది.(The first phase of Saturn half century has begun in this zodiac be careful)
శని దేవుడు ప్రస్తుతం మకర రాశిలో సంచరిస్తున్నారు. అదే సమయంలో ధనుస్సు, మకర, కుంభ రాశుల వారికీ ఏల్నాటి శని ప్రభావంతో కొంత క్లిష్ట సమయం నడుస్తోంది. మిథునం వారికి ఆరో ఇంట శని అంత అనుకూల ప్రభావం చూపించదు. మేషరాశికి 8వ ఇంట ప్రతికూల ప్రభావం చూపిస్తారు. అదే విధంగా తులా రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల చేసే పనుల్లో శని దేవుడు ప్రభావంతో ఎన్నో ఆటంకాలు, సమస్యలను ఎదర్కొంటూ ఉంటారు. . (ప్రతీకాత్మక చిత్రం)
ఏలినాటి శని ప్రభావం ప్రతి మనిషి జీవితంలో జాతకం ప్రకారం రెండు లేదా మూడు సార్లు వస్తూ ఉంటోంది. పుట్టినపుడు జాతకుడు ఏల్నాటి శని ప్రభావంలో పుడితే.. మొత్తంగా మూడు సార్లు అతని జీవితంలో ఏల్నాటి శని ప్రభావం ఉంటోంది. కానీ ఈ పనులు చేయడం ద్వారా శనీదేవుడి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
జాతకుని గోచారం ప్రకారం శనీశ్వరుడు 12వ స్థానంలో ప్రవేశిస్తే.. ఏల్నాటి శని ప్రారంభం.. శనిని అందరు మంద గమనుడు లేదా మందుడు అంటారు. శని ఒక్కో రాశిలో 2 ½ ఏళ్లు ఉంటారు. ఇలా జాతకుడి 12 వ ఇంట, 1 ఇంట, 2వ ఇంట ఉండే వరకు ఏల్నాటి శని ప్రభావం ఉంటోంది. మొత్తంగా 7 ½ ఏళ్లు ఏల్నాటి శని ప్రభావం ప్రతి జాతకుని జీవితంలో ఉంటోంది. . (ప్రతీకాత్మక చిత్రం)
శని పేరు వింటేనే భయం వేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడు ఒక ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. శని గ్రహ సంచారం చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే శని ఒక రాశి నుండి మరొక రాశికి చేరుకోవడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ఏల్నాటి శని సమయంలో శని మంచి కూడా చేస్తాడు. శని మన రాశిలో ప్రవేశించిన సమయంలో ప్రాణ భయం, ధనం లేకపోవడం.. ఒక వేళ వచ్చినా మన దగ్గర ఉండక పోవడం వంటివి ఇందులో భాగం. కొన్ని సందర్భాల్లో వివాహాం, ఇంటి నిర్మాణంతో పాటు ఉద్యోగాలు వంటివి ఆయా జాతకులకు కలిసి వస్తుంటాయి. (The first phase of Saturn half century has begun in this zodiac be careful) . (ప్రతీకాత్మక చిత్రం)
శనీశ్వర గ్రహ తీవ్రతను తగ్గించుకోవాలంటే. విష్ణు సహస్రనామం, రుద్ర నమక చమకాలు, ఆదిత్య హృదయంతో పాటు సుందరాకాండ పారాయణంతో పాటు హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకంతో పాటు శని స్తోత్రం, శని చాలీసా,శని అష్టోత్తర సహస్రనా స్త్రోత్రం చేస్తే శని గ్రహ ప్రభావ తీవ్రత తక్కువగా ఉంటుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ముఖ్యంగా శని అమావాస్య సందర్భంగా ఈ శనివారం నవగ్రహ ఆలయంలోశని దేవుని ఆరాధించడం.. శనీశ్వరుడి ముందు నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించడంతో పాటు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం.. పక్షులకు ఆహారం వేయడం.. పక్షులకు వేళకు ఆహారం వేయడం.. పరమశివుడి పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ద్వారా శని ఆయా జాతకులకు శుభ ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా ఈశ్వరాధన, హనుమంతుని ఉపాసన చేయడం ద్వారా జాతకంలో శని దోష తీవ్రతను తగ్గించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
శనీశ్వరుడుని దర్శించకున్న తరువాత ఆలయం నుంచి బయటకు వచ్చాక పేదవారికి దాన ధర్మాలు చేస్తే శుభం కలుగుతుంది. దానధర్మాలు ధనరూపం లేదా వస్తు రూపం లేదా వస్త్ర రూపంలో చేయాలి. వస్త్రం సుమారు రెండు మీటర్ల పొడవు ఉండాలి. పూజ తర్వాత ఆ వస్రాన్ని దానం చేస్తే, తీసుకున్న వారు ఆ వస్త్రం వినియోగించేలా ఉండాలని శాస్త్రం చెబుతుంది. ఈ సమాచారం మొత్తం ఇంటర్నెట్లో లభించిన ఇతర సమాచారం ఆధారంగా ఇచ్చాము. (ప్రతీకాత్మక చిత్రం)