వృశ్చిక రాశి (Scorpio) : ఈ రాశివారికి త్రిగ్రహి యోగం.. అదృష్టమని చెబుతారు. ఈ యోగం వృశ్చికరాశి రెండో గృహంలో ఏర్పడుతుంది. ఈ యోగం ఆర్థిక ప్రగతిని కలిగిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు ఇంతకు ముందు ఎవరికైనా డబ్బు ఇస్తే, ఇప్పుడు మీకు డబ్బు వెనక్కి వస్తుంది. మీరు పాత పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు
మిథున రాశి (Gemini) : త్రిగ్రహ యోగం మిథునరాశికి లాభిస్తుంది. ఈ యోగం మీ రాశి నుంచి ఏడో గృహంలో ఏర్పడుతుంది. ఇది వైవాహిక జీవితం, కుటుంబ సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ కాలంలో వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు, పెళ్లికాని వారికి వివాహ ప్రతిపాదనలు అందుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.