మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : మేష రాశ్యాధిపతి కుజుడు ధన స్థానంలో ఉన్న కారణంగా మీరు కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా ఆశించిన ప్రతిఫలం పొందుతారు. అయితే, కుటుంబంలో కొద్దిగా సమస్యలు తలెత్తవచ్చు. వాదోసవాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : వృషభ రాశిలో కుజ గ్రహం స్తంభించి ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. తలచిన పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలి౦చే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. బాగా టెన్షన్లు ఉంటాయి. దూకుడు స్వభావం పెరుగుతుంది. రిస్క్ తీసుకుంటారు.(ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : 12వ వ్యయ స్థానంలో కుజుడు ఉండడం వల్ల, డబ్బు నష్టం బాగా ఉంటుంది. స్నేహితులు, బంధువుల కారణంగా మోసపోయే అవకాశం ఉంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలను పాటించండి. అప్పులు ఇవ్వడం కానీ,తీసుకోవడం కానీ మంచిది కాదు. ఆరోగ్యం జాగ్రత్త.(ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): లాభ స్థానంలో కుజ గ్రహం ఉండటం వలన ఆర్థిక పరిస్టితి బాగా మెరుగుపడుతుంది. అప్పులు తీర్చడమే కాకుండా కొందరికి ఆర్థిక సహాయం చేయడం కూడా జరుగుతుంది. శుభ వార్తలు వింటారు.ఉద్యోగ వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం మంచి కబురు వస్తుంది. కొత్తవారు పరిచయమవుతారు.(ప్రతీకాత్మక చిత్రం)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : దశమ ఉద్యోగ, స్థానంలో కుజుడు సంచరిస్తుండడం వల్ల అధికార యోగానికి ఆస్కారముంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులకు బాగుంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) :నవమ భాగ్య స్థానంలో కుజుడు ఉండడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. వీసా సమస్యల వంటివి పరిష్కారం అవుతాయి. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించి మంచి కబురు అందుతుంది. ఉద్యోగంలో మార్పు కోసం చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుంది. ముఖ్యమైన పనులు శ్రమ మీద పూర్తవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి.(ప్రతీకాత్మక చిత్రం)
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : అష్టమ స్థానంలో కుజ గ్రహ సంచారం ఏమంత మంచిది కాదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటు౦ది. కుటుంబంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామి అరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అవసరాలకు తగిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఉద్యోగంలో మార్పులు జరిగి అదనపు బాధ్యతలు మీద పడతాయి.(ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : రాశ్యాధిపతి కుజుడు సప్తమంలో సంచరించడం వలన ఉద్యోగ వాతావరణం బాగానే ఉంటుంది కానీ, ఇంటి వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర పరిచయాల వల్ల ఇబ్బంది పడతారు. వ్యసనాలకు దూరంగా ఉండాలి. డబ్బు నష్టం ఎక్కువగా ఉంటుంది. కోప తాపాలను నిగ్రహించుకోవాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : ఆరవ స్థానంలో కుజ సంచారం వల్ల రోగ, ఋణ, శత్రు భయాల నుంచి బయటపడే అవకాశం ఉంది.ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. అధికారం చేపడతారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. తలచిన పనులు చాలా వరకు పూర్తి చేస్తారు.ఆర్థిక లావాదేవీల వల్ల లబ్ధి పొందుతారు.(ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : అయిదవ స్థానంలో కుజ సంచారం వల్ల జీవితానికి సంబంధించి కొన్ని మంచి ఆలోచనలు చేస్తారు. జీవన శైలిలో మార్పులు తీసుకు వస్తారు. క్రియోటివిటీ పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా చేతికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. ఉద్యోగం విషయంలో కొత్త ఆఫర్లు వస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ ఫలితాలనిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : నాలుగవ రాశి అయిన వృషభంలో కుజుడి సంచారం వల్ల అస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తారు.కుటుంబంలో ప్రశాంతత తగ్గుతుంది. చికాకులు పెరుగుతాయి. చిన్న సమస్యను కూడా భూతద్దంలోచూసుకుని ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. అయితే, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : తృతీయ స్థానంలో కుజ గ్రహ సంచారం వల్ల కొన్ని సాహసోపేతమైన కార్యాలు చేపడతారు. స్పెక్యులేషన్, ట్రేడింగ్ వంటి వ్యవహారాల్లోకి దిగుతారు. డబ్బు కలిసి వస్తుంది. అప్పుల బాధ నుంచి కొద్దిగా బయటపడతారు. ఒక ప్రతిష్టాత్మక సంస్థ నుంచి మంచి ఆఫర్ వస్తుంది. భార్యాపిల్లలతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. (ప్రతీకాత్మక చిత్రం)