మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఆర్థికంగా మేలు జరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. అనుకోని ఆటంకాల కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు ఆగిపోతాయి. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. పనుల ఒత్తిడి ఉంటుంది. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం .(ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఉద్యోగ జీవితంలో చక్కని ఫలితాలు సాధిస్తారు. తగిన విధంగా ప్రయత్నిస్తే ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. వ్యాపారపరంగా జాగ్రత్తలు అవసరం. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : ఉద్యోగంలో ఇబ్బందులు, ఒత్తిళ్లు తగ్గుతాయి. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. కుటుంబ సమస్య నుంచి తెలివిగా బయటపడతారు. సన్నిహితులతో విభేదాలు తలెత్తవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో గోప్యత అవసరం. బంధువుల ద్వారా లాభపడతారు,. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగపరంగా అభివృద్ధి కనిపిస్తోంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వృత్తి వ్యాపారాల్టో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. వ్యక్తిగత సమస్య ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల ప్రయోజనం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం పెండింగ్లో పడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. సర్వత్రా ఒత్తిడి ఉంటుంది. అవాంఛనీయ పరిచయాలకు దూరంగా ఉండండి. అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ధన లాభానికి అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త వ్యాపారంలో ఉన్నవారు లాభాలార్జిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) :ముఖ్యమైన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు గట్టెక్కుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్లైం వేయాలి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు పని చేస్తాయి.పెళ్లి సంబంధం ఆలస్యం అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : మంచి శుభయోగాలున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థితి కనిపిస్తోంది. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కొన్ని నిర్ణయాలు ఎంతగానో కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్యం పరవాలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : ఉద్యోగంలో అధికారుల వల్ల బాగా శ్రమ ఉంటుంది. ఆటంకాలు, అవరోధాలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : అనుకున్న పనులు నెరవేరుతాయి. అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగంలో లక్ష్యాలు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపారులు లాభాల బాట పడతారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. సహనంతో వ్యవహరిస్తే అన్నీమీకు సానుకూలమవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా ఒత్తిళ్లు తప్పవు. వ్యాపారపరంగా లాభాలున్నాయి. కొత్త పనులు చేపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి నిపుణులకు ఆఫర్లు వస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : అన్ని విధాలా కలిసి వచ్చే సమయం. ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి. ఉద్యోగ పరంగా స్థిరమైన ఫలితాలుంటాయి. కొన్ని వ్యక్తిగత, కుటుంబ కష్టాలు తొలగిపోతాయి. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : ఆటంకాలు, అవరోధాలు లేకుండా పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంది. అధికారుల ద్వారా మేలు జరుగుతుంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. దగ్గరి బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)