మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే మంచే జరుగుతుంది. ఎవరి విమర్శలు పట్టించుకోవద్దు. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు.(ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఉద్యోగంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ధన లాభం ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. బాధ ఎక్కువగా ఉంటుంది. తలచిన పనులు పూర్తవుతాయి. కుటుంబం ద్వారా లబ్ది పొందుతారు. ఇతరుల బాధ్యతలు కూడా భుజాలకెత్తుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తోంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది.ఇంటి సమస్యల పరిష్కారంలో సొంత నిర్ణయాలతో పాటు కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోండి. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): అనుకున్నవి అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వాదనలకు దూరంగా ఉండండి. అష్టమ శని కారణంగా తరచూ అనారోగ్యాలు తప్పకపోవచ్చు. కొంతవరకు శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. శరీరానికి విశ్రాంతి అవసరం. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : ఉద్యోగంలో అభివృద్ది ఉంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు నెరవేరతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. జీవిత భాగస్వామి తరపు బంధువులతో ఇబ్బందులుంటాయి.(ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) :మంచి సమయం నడుస్తోంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్టో జాగ్రత్త అవసరం, బంధు మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణ లాభం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులు శుభవార్త వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఒక ఆర్థిక సమస్యతో మానసికంగా ఆందోళన చెందుతారు. ముఖ్యమైన పనుల్ని అతి కష్టం మీద పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. కుటుంబంలో కొద్దిగా విభేదాలు తలెత్తుతాయి.సొంత నిర్ణయాలతో ధైర్యంగా ముందడుగు వేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. ఉద్యోగులు చక్కని ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వివాహా ప్రయత్నాలకు అనుకూల సమయం. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. ఆరోగ్యం పరవాలేదు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.(ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : సమయం బాగుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగపరంగా ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మరింతగా శ్రద్ద పెంచాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపు చేసుకోవాలి. కొందరికి మీ ద్వారా మేలు జరుగుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.(ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : ఒక వ్యూహం ప్రకారం నడుచుకుంటే వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మంచి నిర్ణయాలు తీసుకోండి. అవి మున్ముందు సత్ఫలితాలనిస్తాయి. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. అవసరాలకు తగ్గట్టు డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు క్రమంగా పూర్తవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : కొన్ని చిన్న చిన్న చికాకులున్నా ఆర్థికంగా కోలుకుంటారు. అప్పుల బాధకు పరిష్కారం దొరుకుతుంది.ఇబ్బందుల్లో ఉన్న బంధువులను ఆదుకుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యో గపరంగా శుభ యోగం ఉంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన పనులు వెంటనే పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ,వ్యాపారాల్లో కలిసి వస్తుంది. వాహన సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల వల్ల లాభపడతారు. ఇప్పుడు మంచి పనులు తలపెడితే సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు. (ప్రతీకాత్మక చిత్రం)