మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉ౦టుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఉద్యోగంలో అదృష్టం కలిసి వస్తుంది. సమస్యల పరిష్కారంలో ఆత్మ విశ్వాసంతో వ్యవహరిస్తారు. వ్యాపారంలో ఊహించని శుభ ఫలితాలున్నాయి. బంధు మిత్రులతో సౌమ్యంగా వ్యవహరించాలి. ఆదాయం పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థుల మీద కాస్తంత ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు.(ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : కుటుంబ పరంగా అంతా మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. కొన్ని ఆటంకాలను అధిగమిస్తారు. పనులు పూర్తవుతాయి. విద్యార్ధులు తేలికగా పురోగతి సాధిస్తారు. కొత్త ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగ ప్రయత్నాలలో సత్ఫలితాలు సాధిస్తారు. ఆదాయానికి, ఉద్యోగానికి ఏమాత్రం ఢోకా లేదు. ఉద్యోగంలో ఉన్నత స్థాయి కనిపిస్తోంది. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. శ్రమ మీద చాలా పనులు పూర్తవుతాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపార పరంగా కష్టపడాల్సి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. విద్యార్ధులకు అనుకూలంగా ఉంది. కలిసి వచ్చే నిర్హయాలు తీసుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) :ఆశించిన స్థాయిలో ఉద్యోగ ఫలితాలుంటాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమ పెరిగినా చివరికి మంచే జరుగుతుంది. వస్తు లాభాలున్నాయి. కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సమాజంలో గుర్తింపు సాధిస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులకు పరవాలేదు. స్పెక్యులేషన్ లాభించకపోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఈ రోజంతా కాస్తంత బాగానే ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కని ఫలితాలు పొందుతారు.అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ముఖ్యమైన కుటుంబ సమస్య పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) :వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. తోటి వారి సహాయంతో పనులు పూర్తి చేసుకుంటారు. మీ మీద లేనిపోని అపనిందలు వేసే వారున్నారు. కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అనుకోకుండా అదాయం పెరుగుతుంది. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. విద్యార్ధులకు సమయం బాగుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతాయి. మిత్రులతో కలిసి కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి, ఉద్యోగానికి సమస్య లేదు. వ్యాపారంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి.మనసులోని ఓ కోరిక నెరవేరుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాలి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : ఆకస్మిక ధన లాభం కనిపిస్తోంది. ఒక్కొటొక్కటిగా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ, వివాహా ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. నలుగురికీ మేలు జరిగే కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి.విద్యార్ధులు పురోగతి సాధిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : ఉద్యోగంలో బాధ్యతలు మారి కొద్దిగా శ్రమ పెరుగుతుంది. వ్యాపారం అనుకూలంగా ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థికంగా క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభ వార్తలు వింటారు. ఆటంకాలు ఎదురైనా శ్రమ మీద పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబ సభ్యుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. ఎవరితోనూ వాదాలకు దిగవద్దు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. విద్యార్ధులకు బాగుంది. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు.(ప్రతీకాత్మక చిత్రం)