Zodiac Signs : ఈ రాశుల వారు చెప్పే మాటలను అస్సలు నమ్మకండి.. ఎందుకంటే వీరు?
Zodiac Signs : ఈ రాశుల వారు చెప్పే మాటలను అస్సలు నమ్మకండి.. ఎందుకంటే వీరు?
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు ఎక్కువగా అబద్దాలు ఆడతారని తేలింది. చిన్న చిన్న విషయాలకు కూడా వీరు అబద్ధాలు ఆడతారని జ్యోతిష్యుల అభిప్రాయం. ఇప్పుడు ఆ రాశులు ఏవో చూద్దాం
ఈ ప్రపంచంలో మంచి ఉన్నట్లే చెడు కూడా ఉంటుంది. అలాగా నిజాయితీగా ఉండేవాళ్లతో పాటు అబద్దాలు చెబుతూ అవినీతి చేసే వాళ్లు కూడా ఉన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు ఎక్కువగా అబద్దాలు ఆడతారని తేలింది. చిన్న చిన్న విషయాలకు కూడా వీరు అబద్ధాలు ఆడతారని జ్యోతిష్యుల అభిప్రాయం. ఇప్పుడు ఆ రాశులు ఏవో చూద్దాం (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
అబద్ధాలు ఆడే వారిలో కర్కాటక రాశి వారు ముందుంటారు. వీరు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాన్ని ఆయుధంగా వాడతారు. వీరు ఏదైనా విషయాన్ని సూటిగా కాకుండా డొంకతిరుగుడుగా చెబుతుంటే వారు అబద్ధం చెబుతున్నారని గ్రహించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
సింహరాశి వారు ఇతరులను ఆకర్షించేందుకు అబద్ధాలు ఆడతారు. ఇతరుల ముందు గొప్పలకు పోయి వీరు లేనివి ఉన్నవి కలిపి చెబుతుంటారు. ఆ సమయంలో తాను ఆ గొప్ప పనిని చేశాను అంటూ బడాయి మాటలు చెబుతారు. వీరు అబద్ధాలు చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తి కళ్లలోకి నేరుగా చూసి మాట్లాడలేరు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
అబద్ధాలు ఆడటంలో మిధున రాశి వారిది ప్రత్యేక శైలి. వీరు తమ గౌరవం ఎక్కడ పోతుందనే భయంతో అబద్దాలు ఆడతారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా నిజమని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
వృశ్చికరాశి వారు కూడా అబద్ధాలను చాలా సులభంగా ఆడతారు. వీరు తరచుగా తమ పనులను పూర్తి చేసుకోవడానికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అలాగే కట్టు కథలు చెప్పడంలో కూడా ఈ రాశి వారు ముందుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
తులా రాశి వారు కూడా అబద్ధాలు చెబుతుంటారు. అలాగే తమను తాము రక్షించుకునేందుకు వీరు అబద్ధాలు వాడతారు. నిజాన్ని కొద్దిగా మార్చి వీరు ఇతరులకు చెప్పి సమస్యల నుంచి బయటపడుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం).