జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాశిపరివర్తనానికి, గ్రహాల సంయోగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పరిణామాలు జరిగినప్పుడు భూమిపై ఉండే మనుషులపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. త్వరలో రెండు కీలక గ్రహాలు కలవబోతున్నాయి. వాటి సంయోగం వల్ల పలు రాశులకు మేలు జరిగితే.. మరికొందరికి ఇబ్బందులు కలగనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (Taurus): గురు శుక్రుల సంయోగం వీరికి 11వ స్థానంలో ఏర్పడుతుంది. ఇది ఆదాయం, లాభాలకు సంబంధించినది. అందువల్ల ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులను కూడా సృష్టించుకుంటారు. డబ్బు బాగా వస్తాయి. మీరు వృత్తి జీవితంలో మంచి విజయం సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. వృషభ రాశికి అధిపతి శుక్ర గ్రహమే. అందుకే శుక్రుని ప్రత్యేక అనుగ్రహం మీపై ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (Gemini): ఈ సంయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశితో పదవ ఇంట్లో ఏర్పడుతుంది. దీనినే పని క్షేత్రం అని అంటారు. ఈ నేపథ్యంలో మీకు కొత్త ఉద్యోగం రావచ్చు. మీరు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వస్తుంది. ఈ సమయంలో వ్యాపారంలో మంచి లాభాలను పొందవచ్చు. వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. మీరు కార్యాలయంలో సీనియర్ల మద్దతు పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (Cancer): మీ జాతకంలో తొమ్మిదవ ఇంట్లో గురు, శుక్రుల కలయిక ఏర్పడుతుంది. దీన్నే అదృష్టం, విదేశీ ప్రదేశం అంటారు. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. వాహన సుఖం పొందే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలు రాస్తున్న వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)