సింహం: సింహ రాశి వారి ఏడవ ఇంటిలో అంటే వివాహిత గృహంలో శని దేవుడి మార్పు జరిగింది. అందువల్ల వైవాహిక ఆనందం పెరుగుతుంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. అదృష్ట గృహంపై శని దేవుడి నీచ దృష్టి కారణంగా.. పనిలో సాధారణ ఒత్తిడి, అడ్డంకులు కలుగుతాయి. ఆ తర్వాత పురోగతి ఉంటుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.(ప్రతీకాత్మకచిత్రం)
సింహ రాశి వారు తమ ఆరోగ్యంపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఎముకలకు గాయం, మానసిక ఆందోళన, తలకు సంబంధించిన ఇబ్బందులు రావొచ్చు. శని తదుపరి దృష్టి నాల్గవ ఇంటిపై ఉండటం వలన సంతోషం, తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన, ఛాతీలో అసౌకర్యం, వాహన, గృహాలకు సంబంధించిన పనుల్లో పురోగతి, మార్పులు కనిపిస్తాయి. స్థలం మారే అవకాశం కూడా ఉంటుంది. హనుమంతుడిని పూజించడం వల్ల పురోభివృద్ధి పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య: కన్యారాశిలో శని మార్పు ఆరవ ఇంటిలో జరిగింది. ఇది వ్యాధి, రుణం, శత్రువుకు సంబంధించినది. అందువల్ల రోగాల నుంచి మీరు బయటపడతారు. పాత అప్పులు క్రమంగా తీరిపోతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఎనిమిదవ ఇంటిపై శని దేవుడి మూడో నీచ దృష్టి కారణంగా కడుపు, కాళ్ళ సమస్యలు వస్తాయి. ఈ సమయంలో కిడ్నీలో రాళ్లు, మూత్ర సంబంధిత సమస్యలు ఆందోళన కలిగిస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)
కన్యా రాశి వారికి ప్రయాణ , విద్యకు సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఖర్చు పెరుగుతుంది. ఈ సమయంలో కంటి సమస్యలు కూడా ఒత్తిడిని కలిగిస్తాయి. సోదర సోదరీమణులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయి.కుటుంబ వివాదాల నుండి విముక్తి పొందే పరిస్థితి ఏర్పడుతుంది. కాలానుగుణంగా శని దేవుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)