వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం... గ్రహాల రాశిపరివర్తనం మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఒక గ్రహం సంచారం, సంయోగాల వల్ల అది వ్యక్తి జాతకాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల గ్రహాల సంచారం మనలో సానుకూల, ప్రతికూల మార్పులను తెస్తుంది. గ్రహాల మార్పు కొన్ని రాశుల వారికి శుభం కలిగిస్తే.. మిగతా వారికి అశుభం కలిగిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం: వృషభ రాశిలోని పదవ స్థానంలో గురుదేవుడు ఉదయిస్తాడు . ఇది పరిశ్రమలు, పనికి సంబంధించినది. అందువల్ల వృషభ రాశి వ్యక్తులు వ్యాపారం లేదా ఉద్యోగానికి సంబంధించిన ప్రతి రంగంలో బాగా రాణిస్తారు. మంచి లాభాలు వస్తాయి. ఉద్యగంలో పదోన్నతి లభించే అవకాశముంది. లేదంటే జీతం పెరుగుతుంది. మంచి జాబ్ ఆఫర్ వచ్చే సూచనలున్నాయి.
సింహ: బృహస్పతి ఉదయం సింహరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి గురువు సప్తమంలో ఉదయిస్తాడు. జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది. వారు పూర్తి సహకారం అందిస్తారు. ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది. వివాహం కోసం ఎదురుచూసే వారికిసంబంధం ఖాయమవుతుంది. గతంలో మీ నుంచి డబ్బులు తీసుకున్న వారు తిరిగి చెల్లిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు.
మకరం: ఈ రాశి వారికి బృహస్పతి రెండో స్థానంలో ఉదయిస్తున్నాడు. ఇది వాక్కుకు సంబంధించినది. అందువల్ల ఈ సమయంలో మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశముంది. వ్యాపారంలో పెద్ద ఒప్పందాన్ని చేసుకోవచ్చు. గతంలో రావాల్సిన డబ్బులు ఇప్పుడు మీ చేతికి వస్తాయి. విద్యారంగంతో అనుబంధం ఉన్నవారు మంచి లాభాలు పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)