ASTROLOGY IN TELUGU THESE ZODIAC SIGNS PEOPLE WILL GET TOO MUCH ANGRY THEY DONT LISTEN TO ANYONE HERE IS THE LIST SK
Astrology: తగ్గేదే లే.. ఈ రాశుల వారు సీతయ్యలు.. ఎవరి మాటా వినరు.. దేనికీ భయపడరు
Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. వారు ఎవరి మాటా వినరు. దేనికీ భయపడరు. వీరిని కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కాదు. మరి ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశులున్నాయి. ఒక్కో రాశి స్వభావం ఒక్కో విధంగా ఉంటుంది. కొందరు కూల్‌గా ఉంటే..మరికొందరు మాత్రం మొండిగా ఉంటారు. పలు రాశుల వారికి అమాయకంగా ఉంటే.. కొన్ని రాశులకు చెందిన వారు చలాకీగా ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
రాశుల స్వభవానికి అనుగుణంగా కొన్ని రాశుల వారికి కోపం ఎక్కువగా వస్తుంది. వారు పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతారు. ముక్కుపైనే కోపం ఉంటుంది. ఎవరి మాట కూడా వినరు. దేనికీ భయపడరు. అలాంటి ఆ రాశుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
మేషం (Aries): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారు ఎవరి మాట వినరు. ఎందులోనూ తగ్గరు. ఈ రాశి వారికి చాలా కోపం వస్తుంది. కోపం కారణంగా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వీరితో మాట్లాడి నెగ్గడం చాలా కష్టం. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
వృషభం (Taurus): వృషభ రాశి వారికి కోపం వస్తే ఎవరి మాట వినరు. ఇలాంటి వారిని శాంతింపజేయడం చాలా కష్టం. కంట్రోల్ చేయడం ఎవరి తరమూ కాదు. కోపంలో దేనికైనా తెగిస్తారు. ఎవరితోనైనా కోపంతో మాట్లాడం వల్ల వీరికే నష్టం జరుగుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
5/ 7
సింహ (Leo): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సింహ రాశి వారు చాలా మొండి స్వభావం కలిగి ఉంటారు. వీరికి కోపం వస్తే ఎంతటి వారినైనా వదలిపెట్టరు. దేనికీ భయపడరు. కోపంలో ఏం చేస్తార వారికే తెలియదు. అందుకే ఈ రాశి వారితో ఎక్కువగా వాదించకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
వృశ్చిక (Scorpio): వృశ్చిక రాశి వారికి కూడా కోపం ఎక్కువగా వస్తుంది. ఆవేశంతో ఈ వ్యక్తులతో ఏమీ మాట్లాడకండి. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు ఎవరి మాట వినరు. దేనికీ తలొగ్గరు. కోపంలో వల్ల ఒక్కోసారి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )(ప్రతీకాత్మక చిత్రం)