ASTROLOGY IN TELUGU THESE 4 ZODIAC SIGNS WILL GET LUCK FROM 23RD MAY DUE TO SON MARS AND VENUS RASHI CHANGE CHECK YOU SIGN HERE SK
Astrology: మే 23 నుంచి ఈ 4 రాశుల వారి దశ తిరుగుతుంది.. ఇక నుంచి అంతా అదృష్టమే
Astrology : మే 23 నుంచి పలు రాశుల జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. సూర్యుడు, కుజుడు, శుక్ర గ్రహాల రాశి పరివర్తనం వల్ల వారికి మంచి జరుగుతుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆ వివరాలను ఇక్కడ చూద్దాం.
జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాశి పరివర్తనం ఎంతో కీలకమైనది. ప్రతి గ్రహం కూడా నిర్దిష్ట సమయంలో ఒకరాశి నుంచి మరో రాశిలో సంచరిస్తుంది. గ్రహాల మార్పు రాశులపై ప్రభావం చూపుతుంది. కొందరికి మంచి జరిగితే.. మరికొందరికి అశుభాలు కలుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
మే 15న సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఇవాళ కుజుడు కూడా రాశిని మార్చాడు. కుంభ రాశి నుంచి మీన రాశిలోకి వెళ్లాడు. త్వరలో శుక్రుడి రాశి పరివర్తనం కూడా జరగనుంది. మే 23న శుక్రగ్రహం మేషరాశిలోకి ప్రవేశిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
సూర్యుడు, కుజుడు, శుక్రుడు తమ రాశులను మార్చిన తర్వాత.. కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. అనుకున్నవన్నీ జరుగుతాయి. అనేక సానుకూల ప్రయోజనాలు పొందుతారు. మరి ఆ రాశుంలేంటి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో.. ఇక్కడ తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
మేషం: మేష రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. భాగస్వామితో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఉద్యగంలో ప్రమోషన్ వచ్చే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
వృషభం: వృషభ రాశి వారు భూమి, వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశముంది. భూమిపై పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామి సలహాతో ఊహించని విధంగా ధనలాభం లభిస్తుంది. మీ వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
వృశ్చికం: ఈ సమయంలో తోబుట్టువులతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీరు డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నిండుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
కుంభం: కుంభ రాశుల వారు రహస్య శత్రువుల నుంచి విముక్తి పొందుతారు. మీరు మీ రంగంలో విజయం సాధించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. కానీ ఖచ్చితంగా విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామికి సమయాన్ని కేటాయిస్తారు. కుటుంబ సభ్యుల మద్దుతు పొందుతారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) ప్రతీకాత్మక చిత్రం