మిథునం : మిథున రాశి అమ్మాయిలు వంటలో కొత్త ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. స్వయంగా వండుకుని తినడం అంటే వీరికి చాలా ఇష్టం. వీరు వంట చేయడమే కాదు.. దానిని ఇతరులకు పెట్టడంతో ఎంతో హృదయపూర్వకంగా ఉంటారు. ఈ రాశికి చెందిన అమ్మాయిలు వివాహం తర్వాత.. తమ వంటలత భర్త, అత్తామామల మనసును గెలుచుకుంటారు.(ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటక రాశి : కర్కాటక రాశికి చెందిన అమ్మాయిలు ఆహారాన్ని తయారు చేయడంతో పాటు వడ్డించడంలో ఎంతో నైపుణ్యం కలిగి ఉంటారు. చాలా క్వాలిటీగా వంటలు చేస్తారు. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ అమ్మాయిలు వంట చేస్తే.. ఇళ్లంతా ఘుమఘుమలే..! వీరికి వండడంతో పాటు తినడం కూడా చాలా ఇష్టం. తమ వంటలతో అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య: ఈ రాశి అమ్మాయిలు ప్రతి పనిని ఎంతో అంకితభావంతో చేస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అది వంట పని అయినా... మరేదైనా కావచ్చు. వీరు ఏదైనా పని మొదలు పెడితే.. అది పూర్తయ్యే వరకు వదలరు. అందుకే వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. స్వతహాగా భావోద్వేగాలు కలిగి ఉంటారు. ఈ అమ్మాయిలు తమ ప్రతి బంధం ఎంతో నిజాయితీగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)