వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఈ రోజు మీరు భౌతికంగా శ్రమ కలిగించే పనులైన వాకింగ్ గానీ ఇతర పనులు గానీ చేస్తే మంచిది. ఈ రోజు మీరు చేసే పని బాగా కలిసొస్తుంది. మీ శక్తితో పాటు సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఫేవర్‌గానే ఉంటాయి. మిమ్మల్ని ఈ రోజు ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వకపోడం ఉత్తమం. మర్యాదగానే డబ్బులు లేవని చెప్పడం శుభప్రదం. లక్కీ సైన్ - ఒక ఈక (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : ఈ రోజు మీ కొలీగ్ మిమ్మల్ని సాయం కోరవచ్చు. అప్పుడు మీరు జెన్యూన్‌గా అనిపిస్తే సాయం చేయొచ్చు. మీ లోని ఎమోషనల్ యాంగిల్ ఈ రోజు బయటపడే అవకాశాలుంటాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాలెన్స్ తప్పకుండా ఉండేందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి. లక్కీ సైన్ - గులకరాళ్లు (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్రేష) : ఏదైనా సమాజానికి మేలు చేసే ఉద్యమంలో మీరు భాగస్వామి కావాలనుకుంటే ఈ రోజు నుంచి అందులో చేరి ఆ కాజ్ కోసం ఫైట్ చేయొచ్చు. మీకు ఈ రోజు ఏదైనా ఔట్ డోర్ అప్పాయింట్మెంట్ ఉన్నట్లయితే క్యాన్సిల్ చేసుకోవాలి. గతంలో మీతో పరిచయమున్న వారిని నేడు కలుసుకోవచ్చు. లక్కీ సైన్- కాగితం (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : మీ కింద పని చేసే ఉద్యోగులు ఈ రోజు తమ సమస్య పరిష్కరించాలని మీకు విన్నవించుకోవచ్చు. అప్పుడు మీరు దానిని ప్రాధాన్యతగా గుర్తించి వెంటనే పరిష్కరించడం మంచిది. మిమ్మల్ని కలవడానికి ఈ రోజు అతిథులు చెప్పకుండానే రావచ్చు. మీకు ఈ రోజు సర్ప్రైజ్లతో గడుస్తుంది. లక్కీ సైన్ - ముత్యాలు (ప్రతీకాత్మక చిత్రం)
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఈ రోజు ఆరోగ్యంపైన అత్యంత శ్రద్ధ వహించడం మంచిది. మీతో ఉన్న వారి పట్ల జాగ్రత్త వహించడం చూసి ఇతరులు మీరు బలహీనులని భావించొచ్చు. కానీ, మీరు ఆ విషయం పట్టించుకోకుండా జాగ్రత్తగానే ఉండొచ్చు. మీరు అనుకున్న విషయాలను బలంగా బయటకు చెప్పేయడం ఉత్తమం. ఈ రోజు మీరు అనుకునే నూతన రెసిపీ ట్రై చేస్తే సక్సెస్ అవుతారు. లక్కీ సైన్ - ఎర్రటి తాడు (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : మిమ్మల్ని చూసి ఈ రోజు లింగ భేదమున్న వారు ఆకర్షితులు కావచ్చు. మీ పూర్వ మిత్రుడితో మాట్లాడటం ఉత్తమం. చెడు కలలు వచ్చి మీ నిద్రను డిస్ట్రబ్ చేయొచ్చు. మీకు మీరు సబ్ కాన్షియస్ మైండ్‌లో స్ట్రాంగ్‌గా ఉండటం మంచిది. ఎలాంటి భయాలకు లోను కాకుండా ముందుకు సాగాలి. లక్కీ సైన్ - ఎర్ర ఇటుక గోడ (ప్రతీకాత్మక చిత్రం)
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : మీ ఆత్మీయులు, ఆప్తుల నుంచి ఈ రోజు ఎవరో ఒకరు మిమ్మల్ని వదిలి పెట్టి వెళ్లొచ్చు. మీ గురించి ఎప్పుడూ ఆలోచించే వారు మిమ్మల్ని విడిచి పెట్టే అవకాశాలున్నాయి. అందుకే మీరు మిమ్మల్ని ప్రేమించే వారి కోసం సమయం కేటాయించాలి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించి మెడికల్ చెకప్ చేయించుకోవాలి. లక్కీ సైన్ - నియాన్ హైలైటర్ (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): మీకు ఈ రోజు పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి, అవే మిమ్మల్ని వేధించవచ్చు. మీ తల్లిదండ్రులు మీ గుర్తింపు కోసం తహతహలాడొచ్చు. కాబట్టి వారితో కొంత సమయం గడిపి వారిని సంతోషంగా ఉంచాలి. పాత పద్ధతులో చేసే పని కోసం మీరు సరి కొత్త ప్రణాళిక రచించుకోవడం మంచిది. లక్కీ సైన్ - గ్లాస్ బాటిల్ (ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రోజు మీ బాధ్యతలు మీకు తెలియడంతో పాటు మీ భయాలన్నీ నియంత్రణలోకి వస్తాయి. ఇటీవల కాలంలో మీ జీవితంలో జరిగిన విషయాలన్నిటికీ మీరు ఆనందంగా ఉంటారు. ఇక మీకు చెడు కలలు గానీ సందర్భాలు గానీ వచ్చే అవకాశాలు ఉండబోవు. లక్కీ సైన్ - పాత మర్రి చెట్టు (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4): మీకు ఈ రోజు నూతన కాంట్రాక్టు రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి అడ్డంకులు ఎదురు కావచ్చు. మెడికల్ ఫీల్డ్‌లో ఉన్న వారు ప్రతి రోజు మాదిరిగానే ఈ రోజు చాలా బిజీగా ఉండొచ్చు. మీ కుటుంబానికి మీరే సపోర్ట్ సిస్టమ్ గా ఉండాలి. మీ కుటుంబ సభ్యులకు మీ సహకారం అవసరం కూడా. కాబట్టి మీరు వారితో సమయం గడపడం మంచిది. లక్కీ సైన్ - ఒకే చోట ఉన్న మూడు పక్షులు (ప్రతీకాత్మక చిత్రం)