మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి, శమ పెరుగుతాయి. అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఉద్యోగంలో కొద్దిగా ప్రతికూలతలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రాభవం తగ్గుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు గానీ, స్ధలం గానీ కొనాలని ఆలోచిస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. ఇతరులతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది. దూరంగా ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. చిన్న వ్యాపారులు పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యాపార, ఆధ్యాత్మిక, స్వయం ఉపాధి వంటి రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. కోర్టు కేసు అనుకూలంగా వచ్చే సూచనలున్నాయి. బంధువర్గంలో పెళ్లి సంబం ధం కుదిరే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా ఇంత వరకూ ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉద్యోగం మారాలనుకునేవారు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు ప్రయోజనం పొందుతారు. ఈ నెలంతా ప్రశాంతంగానే గడిచిపోతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. గురువు వ్యయ సంచారం కారణంగా ఉద్యోగ చలనానికి అవకాశం ఉంది. తిప్పట ఎక్కువగా ఉన్నా ఎంతో పట్టుదలతో ముఖ్యమైన ప నులు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణ సూచనలున్నాయి. చాలావరకు అప్పులు తీరుస్తారు. పొదుపు చర్యలు కూడా చేపడతారు. వివాహ సంబంధం కుదురుతుంది. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండండి. వృత్తి నిపుణులు, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగాలలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా మంచి ప్రయోజనం పొందుతారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి.
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రావాల్సిన డబ్బు సరైన సమయానికి అందకపోవచ్చు. మీరు ఇవ్వాల్సిన డబ్బుకు ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. శుభ కార్యాల మీద భారీగా ఖర్చవుతుంది. సొంత నిర్ణయాలు, ఆలోచనల కన్నా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉ౦ది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమవుతుంది. అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. అనవసర పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు పురోగతి సాధిస్తారు. లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఐ.టి నిపుణులకు అన్నివిధాలా అనుకూల సమయం. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విదేశాల నుంచి అవకాశం వస్తుంది. ప్రమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. కోర్టు కేసు ఫలితం అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్రేష) : గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేనందువల్ల ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగానే గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాలను విస్తరించుకునే ప్రయ త్నం చేస్తారు. వ్యాపారులు అధిక లాభాలను చవి చూసే అవకాశం ఉంది. సంతానం కలుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగం మారాలనే ఆలోచన పెట్టుకోవద్దు. అదనపు బాధ్యతలు మీద పడతాయి. భాగస్వామ్య వ్యాపారానికి అనుకూల పరిస్థితి ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. బ౦ధువులతో అభిప్రాయ ఖేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతానంలో ఒకరికి సొంత ఊర్లోనే ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితులు తటస్థపడతారు. బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. కొందరికి ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించినంతగా ప్రయోజనం ఉండదు. ఆరోగ్యం జాగ్రత్త, ఇంజనీర్లు, వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్వారికి బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ నెలలో ఆదాయం తగ్గుతుంది కానీ, ప్రశాంతంగానే గడిచిపోతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అంది కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు వంటివి చోటు చేసుకుంటాయి. సమాజంలో పలుకుబడి పరగడానికి, పలుకుబడి ఉన్న వాళ్లతో పరిచయాలు పెరగడానికి అవకాశం ఉంది. ఇక అష్టమ శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, తలచిన పనుల్లో కొన్నిటిని పట్టుదలతో పూర్తి చేస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యుల సహాయంతో బయటపడతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధిచిన తీపి కబురు వింటారు. సైన్స్, ఐ.టి విద్యార్థులు రాణిస్తారు. ఇతర రంగాలకు సంబంధించిన విద్యార్ధులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నేతలు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార రంగంలో లాభాలకు అవకాశం ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) : గ్రహ సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుని కార్యరూపంలో పెడితే మున్ముందు సత్ఫలితాలనిస్తాయి. మొత్తం మీద ఈ నెలలో సరికొత్త నిర్ణయాలు, ఆలోచనలతో కార్యశూరులవుతారు. తెగించి కొన్ని మంచి పనులు చేపడతారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. కొత్త పరిచయాలు ఏర్పడి, భవిష్యత్తుకు బాట వేస్తాయి. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. పెళ్ళీ సంబంధాలు కుదురుతాయి. బంధు వుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికి పరిస్థితులు కలిసి వస్తాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. అనుకోకు౦డా బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల లో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్జు, శాస్త్రవేత్తలు, ఐ.టి నిపుణులకు బాగుంటుంది. హామీలు ఉండవద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఈ నెలంతా చాలావరకు సాఫీగా సాగిపోతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది కానీ, మానసిక ప్రశాంతత తగ్గుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కొ౦త వరకు పరిష్కారం అవుతాయి. ఇల్లు మారే ఆలోచన చేస్తారు. ఇల్లుగానీ, స్థలం గానీ కొనాలని ప్రయత్నిస్తారు. మొత్తం మీద జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుందనుకోవచ్చు. తలపెట్టిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. పెనుమార్పులు అనుభవానికి వస్తాయి. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఇంట్లో శుభ కార్యానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరతాయి. వ్యాపారులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్డు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్గ్లో దూసుకుపోతారు. బ్యాంకర్పు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యంగా స తృలితాలు సాధిస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : ఉద్యోగుల కంటే వృత్తి వ్యాపారాల వారికి అన్ని విధాలా బాగుంది. చిన్న వ్యాపారులు కూడా అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. మొత్తం మీద ఆర్థిక పురోగతి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అయిదింట శని సంచారం కారణంగా మధ్య మధ్య కొన్ని కుటుంబ సమస్యలు, అనవసర ప్రయాణాలు తప్పవు. సహోద్యోగులలో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. బంధుమిత్రులతో అనుబంధాలు మెరుగుపడతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. యేమ వ్యవహారాల్లో ము౦దుకు పోవడం వల్ల ఇబ్బందులు పడతారు. న్వయం ఉపాధివారు ప్రయోజనం పొందుతారు. సమ యం అనుకూలంగా ఉంది. కోర్టు కేసు వాయిదా పడుతుంది. ఇతరులతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : గ్రహ సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా లేకపోవడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలవారికి కొద్దిగా చిక్కులు ఎదురవుతాయి. అఆదాయంలోను, లా భాలలోను పెరుగుదల, ఎదుగుదల కనిపించవు. సమస్యల పరిష్కారంలో కొద్దిగా ఓర్పుతో వ్యవహరి౦చాల్సి ఉంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. కోర్టు కేసు వాయిదా పడుతుంది. మొత్తం మీద మీకు ఈ నెలంతా పెద్దగా మార్పులు, చేర్పులు ఉండకపోవచ్చు. ఆరోగ్యం పరవాలేదు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తారు. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. దూర ప్రయాణాలకు గానీ, తీర్థయాత్రలకు గానీ ప్రణాళికలు వేసుకుంటారు. ఎవరితోనూ అర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. స్నేహితు ల్లో ఒకరు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా బాగా కలిసి వచ్చే సమయం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : గ్రహ సంచారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలినిస్తాయ్. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ది ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరి జీవిత౦లో స్థిరపడతారు. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. కారు కొనే అవకాశం ఉంది. ఇ౦ట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఆర్థికపరంగా శుభ వార్తలు వింటారు. మొత్తానికి ఈ నెల అన్ని విధాలా అనుకూలంగా ఉంది. జీవితంలో పైకి రావాలనే తపన పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఉద్యోగ సంస్థలో కొత్త ప్రాజెక్టులు చేతికి అందివస్తాయి. భార్యాపిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులు బాగా శ్రమ పడితే గానీ ప్రయోజనం ఉండదు. రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూల౦గా ఉంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తా రు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేదు. మిశ్రమ ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఆర్ధికంగా కొన్ని సమస్యలు, ఇబ్బందులు తలెత్తుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా పెరు గుతాయి. వ్యాపారంలోను, వృత్తిలోను శ్రద్ధను, శ్రమను బాగా పెంచాల్సి ఉంటుంది. ఏలిన్నాటి శని స౦చారం కారణంగా మధ్య మధ్య అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అనవసర ప్రయాణాలకుకూడా అవకాశం ఉంది. మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలున్నాయి. మీ తల్లిత౦డ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అందుతాయి. ఉన్నత విద్య కోసం సంతాన౦లో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. వ్యాపారులు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. సమాజ సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితం కనిపించదు. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమ యం బాగుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : గ్రహ సంచారం కొద్దిగా అనుకూలంగా ఉన్న కారణంగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆకస్మిక లాభం, ఆకస్మిక ధనలాభం, రుణ బాధ నివృత్తి వంటివి అనుభవానికి వస్తాయి. అదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. తీర్థయాత్రలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్లో పెరుగుదల వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. వ్యయంలో శని సంచారం వల్ల ప్రతి పనీ అలస్యం అవుతుంటుంది. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడాల్సి వస్తుంది. ఇంటా బయటా సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, అర్థిక రంగ నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో తృప్తిగా ఉండవు. సొంత నిర్ణయాలతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకోండి. ఏ విషయంలోనూ హామీలు ఉండవద్దు.