Horoscope Today : మేష రాశి వారికీ ఖర్చులు పెరిగినా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మిథున రాశి వారికీ ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, అనుకూలంగా ఉంటుంది. మీన రాశి వారికీ ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఈ నేపథ్యంలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే.. (ప్రతీకాత్మక చిత్రం)
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఉద్యోగ వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. ఖర్చులు పెరిగినా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అనుకున్నవి సాధిస్తారు. సొంత నిర్ణయాలతో ముందుకు వెడతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త, మిత్రులు సహాయంగా ఉంటారు. శుభవార్త వింటారు. వ్యాపారం చాలావరకు నిలకడగా సాగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఆదాయానికి సంబంధించి శుభవార్త వింటారు. ముఖ్యమైన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. పట్టుదలతో అనుకున్నవి సాధిస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం జ్యాగ్రత్త. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : ఆర్థిక అవసరాలు తీరతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్టో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల సహాయంతో ఒక వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):ఉద్యోగంలో సాటి ఉద్యోగుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక స్ధోమత పెరుగుతుంది. వ్యాపారాలకు కలిసి వస్తుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. తొందరపాటు నిర్షయాలు తీసుకోవద్దు. పుణ్యకార్యాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ప్రయాణాలు ఆశించినంతగా లాభించవు. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : మంచి సమయం నడుస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారులు బాధ్యతలను పెంచుతారు. వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ వల్ల సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల వారి ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) : ఉద్యోగంలో అధికారులు సహాయంగా ఉంటారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది.పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. శుభవార్త వింటారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం జాగ్రత్త స్వయం ఉపాధిలో ఉన్నవారు కొద్దిగా పురోగతి సాధిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులున్నా విజయవంతంగా ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి పరిచయాలు అవుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది.. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోండి. అందరితోనూ సామరస్యంగా వ్యవహరించండి. కుటుంబ వాతావరణం మెరుగుపడుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వృద్ధికి తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలవారు అభివృద్ది సాధిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) :పట్టు వదలకుండా ప్రయత్నిస్తే ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారపరంగా లాభాలున్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. నిరుద్యోగులకు మంచి అవకాశాలువస్తాయి. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) :ఉద్యోగం ఆనందంగా, ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు. అవసరాలు తీరతాయి. ఊహించని విధంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వృత్తి నిపుణులకు అన్నివిధాలా బాగుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కొత్తగా ఎందులోనూ పెట్టుబడులు పెట్టవద్దు. స్నేహితులతో అపార్ధాలకు అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది. నిరుద్యోగులు సత్పలితాలు పొందుతారు. .(ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : ఉద్యోగంలో అధికార యోగం ఉంది. ఆదాయానికి సంబంధించి శుభవార్త వింటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు.పిల్లల స్థితిగతులు బాగుంటాయి. ఇష్టమైనవారితో వివాహ సంబంధం కుదురుతుంది. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. (ప్రతీకాత్మక చిత్రం)