దాదాపు ప్రతి ఇంట్లో కొత్తిమీర ఉంటుంది. వంటల్లోకి వాడే సుగంధ ద్రవ్యాల్లో దీనికి ప్రత్యేక స్థానముంది. చాలా రకాల కూరల్లో కొత్తిమీరను వాడుతారు. కొత్తమీరతో కూరకు రుచి పెరగడమే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిది. జ్యోతిష్యశాస్త్రంలో.. కొత్తిమీరను సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ఉపయోగిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
మీకు కొందరు డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎంత అడిగినా ఇవాళ.. రేపు.. అంటూ కాలం గుడుపుతారు. మీకు కూడా అలాంటి అనుభవం ఎదురైతే.. ఓ కాగితంపై రుణ గ్రహీత పేరును రాసి.. అందులో ధనియాలను ఉంచి.. మడతపెట్టాలి. అనంతరం దానిని ప్రవహించే నీటిలో వదిలిపెట్టాలి. ఇలా చేస్తే మీ డబ్బు చేతికి అందుతుందట. (ప్రతీకాత్మక చిత్రం)
మనలో చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఎంత సంపాదించినా.. నెల తిరిగే సరికి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. మీ డబ్బు కూడా ఎక్కువ ఖర్చవుతుంటే.. ప్రతి బుధవారం ఆవుకు కొత్తిమీరను తినిపించాలి. ఇలా చేస్తుంటే.. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందట. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం
శుక్రవారం నాడు లక్ష్మీదేవి పటం ముందు ఎర్రటి వస్త్రంలో కొత్తిమీరను ఉంచి, అందులో వెండి నాణెం ఉంచండి. అనంతరం అమ్మవారికి పూజ చేయాలి. ఆ తర్వాత వస్త్రాన్ని మీరు డబ్బులు ఉంచే చోట పెట్టాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల ఆర్థిక పురోభివృద్ధితోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)