సింహం : 12 రాశులకు అధిపతి సింహం. వీరు పుట్టుకతోనే నాయకులు. నాయకుడిగా వీరికి ఒకరు చెప్పాల్సిన పని ఉండదు. ప్రతి విషయంలోనూ వీరిదే పెత్తనం. అదే సమయంలో ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు చాలా సార్లు కరెక్ట్ అని రుజువు చేయబడతాయి. దాంతో వీరు తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించేందుకు ఇతరులు జంకుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం : ఈ రాశి వారిపై శని దేవుడి ప్రభావం ఉంటుంది. దాంతో చిన్నతనం నుంచే క్రమశిక్షణ అలవడుతుంది. ఏ పనినైనా సరే పద్ధతిగా పూర్తి చేయడంలో వీరు సిద్ధహస్తులు. శని ప్రభావం వల్ల వీరు తమ జీవితంలో చాలా పాఠాలను నేర్చుకుని ఉంటారు. దాంతో వీరు ఏ విషయంపైనైనా సరే నిర్భయంగా మాట్లాడగలరు. వీరు దూరదృష్టితో ఆలోచించగలరు. తమ పనుల్లో కొన్నిసార్లు నిరుత్సాహానికి గురైనా గోడకు కొట్టిన బంతిలా పైకి లేచి తమ పనిని పూర్తి చేసి ఇతరులకు రోల్ మోడల్ గా నిలుస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
కుంభం : పని విషయాల్లో వీరు ఏ నిర్ణయం కూడా ఎమోషనల్ గా తీసుకోరు. అదే వీరిని గొప్ప లీడర్ గా ఇతరులకు చూపుతుంది. అయితే ఈ రాశి వారికి రాజకీయాల్లోకి వెళ్లాలనే కోరిక బలంగా ఉంటుంది. వీరు తమ కోసం కంటే కూడా సమాజం కోసం పని చేసే వారిగా ఉంటారు. అమెరికన్ తొలి అధ్యక్షుడు అబ్రహం లింకన్ రాశి కూడా కుంభం కావడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)