మేషరాశి పిల్లలకు అద్బుతమైన వ్యక్తిత్వం ఉంటుందట. వీరు చాలా సృజనాత్మకంగా ఉంటారు. వారి వయసు పిల్లలతో కంటే కూడా చాలా పరిణతి చూపిస్తారని జ్యోతిష్యం చెబుతుంది. గెలవాలనే పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ నేర్చుకుంటారట. అందుకే ఈ రాశి పిల్లలు చదువు, ఆటల్లో ఎప్పుడూ నంబర్ వన్ గా ఉంటారని జ్యోతిష్యం చెబుతుంది. (ప్రతీకాత్మక చిత్రం).
వృషభ రాశి పిల్లలు ప్రతి పనిలోనూ ముందుంటారు. కష్టపడి పనిచేసే తత్వం వీరిది. పుట్టుకతోనే నాయకత్వం.. వాగ్దాటి వంటి అంశాలు వీళ్లకు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి పిల్లలకు సమస్యలపై పోరాడే అలవాటు చిన్నతనం నుంచే ఉంటుందట. వీరు స్వతహాగా మొండిగా ఉంటారు. గెలవాలనే సంకల్పం వీరికి ఉంటుంది. వీరి వ్యక్తిత్వం ఇతరులను ఇట్టే ఆకర్షిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం).
వృశ్చికరాశి పిల్లలు సృజనాత్మకంగా ఉంటారు. ప్రతి పనిలోనూ క్రియేటివిటీ చూపిస్తారు. స్కూల్ లో ఎటువంటి పోటీలు జరిగినా వీరు ముందుంటారు. డ్రాయింగ్, గేమ్స్ వంటి వాటిలో వీరు నంబర్ వన్. గెలవాలనే పట్టుదల వీరికి ఎక్కువగా ఉంటుంది. బట్టి పట్టే నైజం వీరిది కాదు. ఈ కారణం చేతనే వీరు టీచర్లను, పేరెంట్స్ ను ఎక్కువగా ప్రశ్నలతో విసిగిస్తుంటారట. (ప్రతీకాత్మక చిత్రం)