శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారా మీన రాశి వారికి అనుకూలంగా ఉండనుంది. ఒక ముక్కలో చెప్పాలంటే డిసెంబర్ 29 నుంచి మీన రాశి వారికి అదృష్ట కాలం అని చెప్పవచ్చని జ్యోతిష్యం పేర్కొంటుంది. ధన లాభం కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో శాంతి, సంతోషం ఉంటుంది. సమాజంలో ఈ రాశి వారికి ఎంతో గౌరవం లభిస్తుంది. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం).
మకరరాశిలో శుక్రుని ప్రవేశం కర్కాటక రాశివారి అదృష్టాన్ని కలిగించబోతుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితిలో మార్పులు వస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. చేతి నిండా డబ్బు ఉంటుంది. పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లయితే ఇదే సరైన సమయం అని గుర్తించుకోండి. ఈ సమయంలో గౌరవం, హోదా చాలా పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రుడు మకరరాశిలో సంచరించడం మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరు ప్రతి పనిలోనూ విజయం సాధించే అవకాశం ఉంది. ఈ కాలంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు త్వరలో తొలగిపోతాయి. అంతే కాదు వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)