Astrology 2022 : ఐక్యూలో ఈ రాశుల వారు తోపులు.. అత్యంత తెలివైన ఆ రెండు రాశులు ఏవంటే?
Astrology 2022 : ఐక్యూలో ఈ రాశుల వారు తోపులు.. అత్యంత తెలివైన ఆ రెండు రాశులు ఏవంటే?
Astrology 2022 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభ, వృశ్చిక రాశుల వారిని అత్యంత తెలివైన వారిలా పరిగణిస్తారని అమెరికాకు చెందిన మయో స్కూల్ ఆఫ్ ఆస్ట్రాలజీలో పనిచేసే నీల్ క్రాబ్ ట్రీ పేర్కొన్నారు.
సమాజంలో తెలివైన వారిగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనం తెలివైన వారిగా మరికొన్ని సందర్భాలలో తెలివి తక్కువ వారిలా ఇతరుల ముందు నిలుస్తాం. తెలివి అంటే ప్రదేశాలను గుర్తించికోవడమో.. బట్టీ పట్టి మార్కులను సాధించడమో అంటే మీరు పొరబడినట్లే.. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
రాశి చక్రంలోని 12 రాశుల వారు కూడా తెలివైన వారే. కానీ.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు రాశులు అత్యంత తెలివనిగా పేర్కొంటారు. ఇందులో ఒక రాశి దేని గురించైనా సరే విశ్లేషించడంలో తిరుగులేని వారిలా ఉంటే.. ఇంకో రాశి వారు పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించడంలో తెలివైన వారిలా ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభ, వృశ్చిక రాశుల వారిని అత్యంత తెలివైన వారిలా పరిగణిస్తారని అమెరికాకు చెందిన మయో స్కూల్ ఆఫ్ ఆస్ట్రాలజీలో పనిచేసే నీల్ క్రాబ్ ట్రీ పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఆయన కథనం ప్రకారం కుంభరాశి వారు పుట్టుకతోనే మంచి ఐక్యూతో పుట్టి ఉంటారట. అంతేకాకుండా వీరి ఆలోచనలు ఎక్కువ శాతం విశ్లేషణాత్మకంగ ఉంటాయట. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ లో వీరిని కొట్టేవారే లేరన్నది ఆయన అభిప్రాయం. వీరి వివరణలు అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటాయట. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
వృశ్చిక రాశి వారు కుంభ రాశిలా కాదట. వీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ముందుంటారట. వీరు అప్పటికప్పుడు తెలివిగా ఆలోచించి తమ సమస్యల నుంచి బయటపడే శక్తి వృశ్చిక రాశి వారికి ఉంటుందట. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఈ రెండు రాశులతో పాటు వృషభం, కన్య, మకర రాశుల వారు కూడా తెలివైన వారే అట. వీరు వృశ్చిక రాశి వారిలా ప్రాక్టికల్ గా ఆలోచించి తమ సమస్యల నుంచి బయటపడుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. (ప్రతీకాత్మక చిత్రం)