మేషరాశి అమ్మాయిలను అత్యంత శక్తివంతులుగా పేర్కొంటారు. ప్రతి పనిలోనూ విజయం సాధించాలనే కోరిక ఈ రాశి వారికి ఉంటుందట. ఏదో సాధించాలని.. అందరిలా ఉండకూడదనే కోరిక ఈ రాశి అమ్మాయిల్లో బలంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు ఏ పరిస్థితికైనా ఇట్టే అలవాటు పడే గుణం ఉంటుందట. అంతేకాకుండా తమకు ఇచ్చిన పనిని ఇష్టంతో చేస్తూ విజయం సాధిస్తారట. తమపై అనవసర పెత్తనం చెలాయించే వారిపై సివంగిలా విరుచుకుపడటం వీరి నైజం అని జ్యోతిష్యం చెబుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటక రాశి మహిళలు చాలా అణుకువగా ఉంటారట. అలా అని వీరిని మెతక మనుషులుగా ఊహించరాదని జ్యోతిష్యం చెబుతుంది. వీరు కుటుంబ సంరక్షణను చూసుకుంటారట. తమ కుటుంబానికి ఏదైనా ఆపద తలెత్తుందని తెలిస్తే వెంటనే రంగంలోకి దిగి ఆ సమస్యలను పరిష్కరిస్తారట. పిల్లలను చూసుకోవడంలో ఈ రాశి మహిళలలు ప్రత్యేకతను కలిగి ఉంటారట. సెన్సిటివ్ గా ఉన్నా ఈ రాశి మహిళలు చాలా ధైర్యవంతులు. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చిక రాశి మహిళలు అత్యంత తెలివైన వారిగా అభివర్ణిస్తారు. వీరు పక్కా ప్రణాళికతో తమ పనులను పూర్తి చేస్తారట. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వీరు కొంచెం కూడా భయపడరని జ్యోతిష్యం చెబుతుంది. అంతేకాకుండా అప్పటికప్పుడు ఉపాయం ఆలోచించి అందులో నుంచి బయటపడతారట. ఈ రాశి అమ్మాయిలు లీడర్స్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)