వృశ్చిక రాశి వారికి కాస్త స్వార్థం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. వీరు ఎప్పుడూ తమ గురించి మాత్రమే ఆలోచించే మనస్థత్వం కలవారు. తమకు లాభం అంటే దాని వల్ల ఇతరులకు చెడు జరిగినా పెద్దగా పట్టించుకోరని జ్యోతిష్యం చెబుతుంది. ఇక డబ్బు విషయంలో కూడా అలానే ఉంటారట. అప్పుగా డబ్బును తీసుకున్న తర్వాత వారికి తిరిగి చెల్లించాలనే విషయాన్ని మరిచిపోతారట. దాంతో ఈ రాశి వారికి డబ్బును అప్పుగా ఇచ్చిన వారికి ఇబ్బందులు తప్పవని జ్యోతిష్యులు చెబుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
ధనస్సు రాశి వారు స్వతహాగా మంచివారు. వీరు ఇతరును ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ అనుకోరు. కానీ, వీరు కొన్ని విషయాలను మరిచిపోతూ ఉంటారు. అప్పు తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని వీరు మరిచిపోయే అవకాశం ఉంటుంది. దాంతో అప్పును చెల్లించకపోవచ్చు. కాబట్టి ధనస్సు రాశి వారికి మీరు అప్పు ఇచ్చినట్లయితే ఆ విషయాన్ని వారికి పదే పదే గుర్తు చేస్తూ ఉండండి. లేదంటే వారు చెల్లించడం చాలా కష్టం. (ప్రతీకాత్మక చిత్రం)