వృషభ రాశి వారు నమ్మించడంలో ముందుంటారు. తాము చెప్పింది నిజం అన్నట్లు ఎదుటి వారిని నమ్మేలా చేస్తారు. ఇందు కోసం వీరు చిలక పలుకులు పలుకుతారు. అప్పటి వరకు జరిగిన విషయాలను ఒక వరుస క్రమంలో చెబుతూ.. ఈ కారణం వల్ల ఇది జరిగింది అని నమ్మిస్తారట. అనంతరం తమ పనులను పూర్తి చేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారట. ప్రణాళికలు వేయడంలో కూడా వీరు ముందుంటారట. (ప్రతీకాత్మక చిత్రం)
ఇందులో కర్కాటక రాశి వారిది ప్రత్యేక శైలి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. వీరు తమ మాటలతో విషయాలను తారుమారు చేస్తారట. వాస్తవంగా ఒకటి జరిగితే దానిని కాకుండా జరగని విషయాన్ని జరిగిన దానిలా చెప్పి ఎదుటి వారిని ఈ రాశి వారు నమ్మిస్తారట. వీరు చెప్పే విషయాలపై జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)