కర్కాటక రాశి వారు మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా ఎంతో స్వచ్ఛమైన హృదయంతో ఉంటారట. దీనివల్ల జీవితంలో చాలాసార్లు మోసపోవాల్సి వస్తుంది. అయితే వీరు ఎదుటి వారి బాధను చూస్తు తట్టుకోలేరు. వారికి సహాయం చేయడానికి వెళ్లి ఇబ్బందుల్లో పడతారు. దాంతో కర్కాటక రాశి వారు జిత్తులమారి ఆలోచనలతో ఉన్న వారికి దూరంగా ఉంటేనే మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు రాశి వారు చాలా తెలివైన వారు. కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఎప్పుడూ ముందుంటారు. అయితే వీరి మంచితనం వలన తమ ఆలోచనలను ఉపాయాలను ఇతరులతో షేర్ చేసుకుంటారు. చివరకు తమ ఉపాయాలతో ఇతరులు ఉద్యోగంలో పదోన్నతి పొంది వీరిని చులకనగా చూస్తారు. దాంతో ధనుస్సు రాశి వారు బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా స్నేహం చేసేటప్పుడు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
మీన రాశి వారు మాటపై నిలబడే స్వభావం గలవారు. వీరు మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చే తీరుతారు. కొన్ని సందర్భాలలో ఇదే వీరిని నలుగురిలో తల దించుకునేలా చేస్తుంది. ఇతరుల పొగడ్తలకు పొంగిపోయి అనవసరపు వాగ్దానాలు ఇస్తారు. ఆ తర్వాత వాటిని తీర్చేందుకు అనేక ఇబ్బందులు పడతారు. అంతేకాకుండా తమ మంచి తనాన్ని స్వార్ధం కోసం ఉపయోగించుకునే వారి చేతుల్లో మోసపోతుంటారు కూడా. (ప్రతీకాత్మక చిత్రం)