కన్య రాశి వారు ఎక్కువగా ఆలోచిస్తారు. చిన్న చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకుని ఎక్కువగా ఆలోచిస్తుంటారు. దాంతో తాము తీసుకున్న నిర్ణయం సరైంది కాదనే భావనతో ఉన్న పళంగా ఆలోచనను మార్చేస్తారు. సినిమాకు వెళ్లడం.. హోటల్ కు వెళ్లి భోజనం చేయడం వంటి విషయాల్లో కూడా వీరి ఆలోచనలు నిలకడగా ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం).
మీనరాశి వారితో కలిసి ఎక్కడికన్నా వెళ్లాలని మాత్రం మీరు అనుకోకండి. ఎందుకంటే వీరు చివరి నిమిషంలో తాను నిర్ణయం మార్చుకున్నానని రాలేనని చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరే వచ్చి ఫలానా రోజున అక్కడికి వెళ్దాం అని చెప్పినా.. తీరా ఆ రోజు రాగానే తనకు వేరే పని ఉందని చెప్పే అలవాటు ఈ రాశి వారిది. (ప్రతీకాత్మక చిత్రం).