ఆర్థిక కష్టాల నివారణ: ఆర్థిక అవరోధాలు తొలగిపోవాలంటే ఏ మాసమైనా శుక్ల పక్షం శుక్రవారం రాత్రి ఒక చిన్న వెండి బాక్సులో నాగకేసర పువ్వు, కొంచెం తేనెను కలిపి మూసేయండి. ఆ తర్వాత వెండి బాక్సును బీరువాలో ఉంచండి. కొన్ని రోజుల్లోనే మీకు డబ్బులు వస్తాయి. దీపావళి రోజున కూడా ఇలా చేయొచ్చు. నాగకేసర పూలు శివునికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి సోమవారం నాడు భోళా శంకరుడికి పూజ చేసేటప్పుడు వీటిని సమర్పిస్తే మీ కోరికలు నెరవేరుతాయి.