Astro Tips for Job: ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదా? ఇలా చేసి చూడండి
Astro Tips for Job: ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదా? ఇలా చేసి చూడండి
Astrology: కొందరికి ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాదు. కష్టపడిచదివినా.. ప్రతిభ ఉన్నా.. కోరుకున్న ఉద్యోగం దక్కదు. ఇలాంటి వారికి జ్యోతిష్య పండితులు కొన్ని పరిహారాలను సూచించారు. వాటిని పాటిస్తే.. ఉద్యోగం వచ్చే అవకాశముందట.
జ్యోతిష్యశాస్త్రంలో ఎన్నో సమస్యలకు పరిహారాలు, పరిష్కారాలు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని చాలా మంది విశ్వసిస్తారు. నిరుద్యోగానికి సంబంధించి కూడా కొన్ని చర్యలను జ్యోతిష్య పండితులు సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొన్న కొన్ని పరిహారాలను పాటిస్తే.. నిరుద్యోగ సమస్య తీరుతుందట. తక్కువ సమయంలోనే మంచి ఉద్యోగం లభించి... కష్టాలు దూరమవుతాయట. మరి నిరుద్యోగాన్ని దూరంచేసే ఆ పరిహారాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి సుందరకాండ పఠించండి. హనుమాన్ చాలీసాను ఏడుసార్లు చదవాలి. దేశీ నెయ్యితో చేసిన చుర్మాను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల నిరుద్యోగం త్వరగా తీరిపోతుందని నమ్ముతారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
కోరుకున్న ఉద్యోగం పొందడానికి.. ప్రతి సోమవారం శివుడిని పూజించాలి. శివాలయానికి వెళ్లి శివునికి పాలు, అన్నం సమర్పించాలి. ఇలా శివారాధన చేస్తే నిరుద్యోగ సమస్యలు తీరిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
గణేశుడిని పూజించినా మంచి ఫలితాలు ఉంటాయట. వినాయకుడిని నిత్యం పూజిస్తూ... లవంగాలు, తమలపాకులు సమర్పించండి. వినాయకుడి దగ్గర పెట్టిన లవంగం, తమలపాకులను ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు..తీసుకెళ్లాలి. ఇలా చేస్తే ఉద్యోగం రావచ్చట. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 8
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడిని పూజించాలి. ఆదివారం ఉప్పు లేని ఆహారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కెరీర్లో త్వరితగతిన విజయాలు అందుకుంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఇంటర్వ్యూ రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయండి. నీళ్లలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల మేలు జరుగుతుందట. దేవుని ముందు 11 అగరుబత్తీలను వెలిగించి.. నీరున్న బావిలో పాలు పోయాలి. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దట. ఈ పరిహారాల ద్వారా నిరుద్యోగం త్వరగా తొలగిపోతుందట. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)