మన దేశంలో చాలా మంది స్కంద పంచమిని చేస్తారు. ఉదయాన్నేలేచి , శుచిగా స్నానంచేస్తారు. కాళ్లకు పసుపు రాసుకుని, పాలను తీసుకుని ఆలయాలకు వెళ్తారు. అక్కడ ప్రత్యేకంగా శివుడిని, జంట నాగులను అభిషేకం చేస్తారు . కొంత మంది నాగుల ముందు ఫలాలు, గుడ్లను కూడా సమర్పిస్తుంటారు. కొందరు ఆలయ పరిసర ప్రాంతాలలో పాములను పట్టి ఆడిస్తుంటారు. అక్కడ పాములను పాలను తాగిస్తుంటారు.