ఈ ఏడాది మే నుంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ పరిస్థితి ఈ ఏడాదంతా కొనసాగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు తప్పకుండా పరిష్కారం అయ్యి మనశ్శాంతి ఏర్పడుతుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. రాజకీయంగా కూడా పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగరీత్యా లేదా చదువుల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆస్తి లభిస్తుంది.
అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. బంధువుల వల్ల అవమానం పాలయ్యే సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. నవంబర్ తర్వాత వ్యాపారంలో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. వెంకటేశ్వర స్వామి స్తోత్రం పారాయణం వల్ల కొన్ని సమస్యల నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది.