Debt: అప్పులు పెరుగుతున్నాయా.. వెంటనే ఈ పూజ చేస్తే మంచి ఫలితాలు..
Debt: అప్పులు పెరుగుతున్నాయా.. వెంటనే ఈ పూజ చేస్తే మంచి ఫలితాలు..
Debt: కరోనా సమయంలో చాలా మంది అప్పులు చేశారు. వాటిని తీర్చలేక... వడ్డీలు పెరుగుతుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అలాంటి వారు ఈ పూజ చెయ్యాలని పండితులు సూచిస్తున్నారు.
అప్పు అనేది గుదిబండ లాంటిది. అది ఎప్పటికీ ప్రమాదకరమే. కొంచెం అప్పు ఉన్నా చాలు... దానిపై వడ్డీ, చక్ర వడ్డీ పడుతూ.. కొండలా మారుతుంది.
2/ 8
అందువల్ల అప్పుల ఊబిలో ఉన్నవారు మాత లక్ష్మీదేవి శరణు కోరాలని పండితులు సూచిస్తున్నారు. అప్పుల్లో ఉన్నవారికి లక్ష్మీ స్తోత్రం మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు.
3/ 8
మీరు లక్ష్మీదేవిని పూజించాలనుకుంటే... రోజూ స్నానం చేసి... తామర గింజల మాల (garland of lotus seeds)తో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ఈ మాల ఎక్కడి నుంచి తేవాలి అనే డౌట్ రావచ్చు. ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో వీటిని అమ్ముతున్నారు.
4/ 8
లక్ష్మీ దేవి చెంత మీరు 24 గంటలూ ఓ దీపాన్ని వెలిగించి ఉంచాలి. ఈ దీపపు ప్రమిద... మట్టితో చేసినది లేదా వెండిది అయి ఉండాలి. అప్పుడు లక్ష్మీ దేవి ఎంతో ఆనందిస్తూ మీపై కరుణ, కటాక్షాలు చూపిస్తారని పండితులు చెబుతున్నారు.
5/ 8
మీ ఇంటి తూర్పు వైపున తులసి కోట ఉండాలి. చిన్నదైనా పర్వాలేదు కానీ... దాన్లో రోజూ ఉదయం వేళ ఓ దీపం వెలిగించాలి. తులసికి నమస్కారం పెట్టి లక్ష్మీదేవిని మొక్కుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తారట.
6/ 8
మీకు అప్పులు మరీ ఎక్కువగా పెరిగిపోతే... మీరు మరో పూజ చేయవచ్చు. వెంటనే అప్పులు తీరుతాయి. ఇందుకోసం లక్ష్మీదేవి 12 శ్లోకాలు... వరుసగా 12 రోజులు చదవాలి. దాంతో మీ అప్పులన్నీ తీరిపోతాయి.
7/ 8
ఇంకా మెరుగైన ఫలితాలు కావాలంటే ప్రతి శుక్రవారం... ఓ మట్టి ప్రమిదలో కమలం వేర్ల (lotus root)ను వెలిగించాలి. ఇలా చేస్తే... ఆ ఇంట సంపద పెరుగుతుంది. అశాంతి తొలగి మనస్శాంతి లభిస్తుంది. ప్రశాంత చిత్తంతో సరైన నిర్ణయాలు తీసుకుంటూ... క్రమంగా అప్పుల ఊబి నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు.
8/ 8
(Disclaimer: The information and information given in this article is based on general information. Telugu news18 does not confirm the same. Before implementing these, please contact the concerned expert.)