నెల అంత కష్టపడి పనిచేసిన ఉద్యోగులు.. జీతం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. జీతం ఎప్పుడు వస్తుందా అని... చిన్న ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి వరకు అంతా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. జీతం రాగానే.. ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. నెల రోజులంతా కష్టపడితే వచ్చిన జీతం... నాలుగు రోజులు కూడా కాకుండా మొత్తం ఖాళీ అయిపోతే చాలా బాధేస్తుంది. చాలామంది విషయంలో ఇదే జరుగుతుంది.
ఒకటవ తారీఖు వచ్చిన తర్వాత.. జీతం పడగానే.. నాలుగు రోజులు కాకుండానే.. పర్సు ఖాళీ అయిపోతుంటుంది కొందరికి. పర్సులో కాదు కదా చేతిలో కూడా చిల్లి గవ్వ కూడా మిగలదు. మళ్లీ స్నేహితుల్ని వారినివీరిని అడిగి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నవారు...చేయాల్సిన చిన్న పరిహారాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మన జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో ఆర్థిక సమస్యలకు.. రకరకాల పరిహారాల్ని అందించారు మన పూర్వీకులు, పండితులు. వాటిలో కొన్నింటిన అయినా మనం ఆచరిస్తే.. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జీతానికి సంబంధించిన సమస్యలు ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తే, అతను తన రాశిని బట్టి కొన్ని ప్రత్యేక పరిహారాలు చేస్తే సరిపోతుంది. (మనీ అస్ట్రాలజీ) (ప్రతీకాత్మక చిత్రం)
మేషం , సింహం, ధనస్సు : మీది మేషం, సింహం లేదా ధనుస్సు రాశి అయితే మీకు జీతం వచ్చిన వెంటనే ఈ పనిని ఖచ్చితంగా చేయాలి. మీకు జీతం రాగానే.. అందులో కొంత భాగాన్ని విరాళంగా ఇవ్వండి. పేదలకు తినేందుకు ఆహారం కానీ.. మినపపప్పుతో చేసిన పదార్థాల్ని అనాథ అశ్రమాల్లో, లేదంటే వృద్ధాశ్రమాలు వంటి స్వచ్ఛంత సంస్థల్లో పంపినీ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు పనిచేసే ఆఫీసులో, మీ ఉద్యోగంలో టెన్షన్ తగ్గుతుంది. మీకు ఆర్థికంగా కూడా లాభం చేకూరుతుంది.
కుంభం, మిథునం, తులా : తులా, కుంభ రాశి: మీరు మిథునం, తులారాశి లేదా కుంభరాశి వారు అయితే తమ జీతంలో కొంత భాగాన్ని ఆసుపత్రిలో విరాళంగా లేదా ఆ డబ్బుతో చికిత్స చేయించుకోవాలి. కావాలంటే మందులు కూడా పంపినీ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఉద్యోగం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుంది. మీ కుటుంబంలో కూడా సంతోషాలు వెల్లివిరిస్తాయి.
కర్కాటకం, వృశ్చికం, మీన రాశి : మీరు కర్కాటకం, వృశ్చికం లేదా మీన రాశి వారు అయితే మీరు జీతం పొందిన తర్వాత దానిలో కొంత భాగాన్ని బట్టలు లేదా బూట్ల కోసం ఖర్చు చేయాలి. దీని తర్వాత మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వృద్ధులకు ఈ వస్తువుల్ని ప్రేమగా ఇవ్వాలి. అదే విధంగా ... ఎవరికైనా తాగేందుకు నీటినికూడా ఏర్పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు పనిచేస్తున్న ఉద్యోగంలో పురోగతిని కలిగిస్తుంది. అంతేకాకుండా దీర్ఘాయుషును కూడా పొందవచ్చు. మీరు ఆరోగ్యవంతులుగా జీవిస్తారు.