ఇక, గ్రహాల సంచార పరంగా ఏప్రిల్ నెల చాలా ముఖ్యమైనది. ఏప్రిల్ లో కొన్ని ముఖ్యమైన గ్రహాల గమనంలో పెను మార్పు రానుంది. ఏడాదికోసారి రాశి పరివర్తనం చెందే గురుగ్రహం ఏప్రిల్ 2023లో సొంతరాశి మీనం నుంచి బయటికొచ్చి మేషరాశిలో ప్రవేశించనున్నాడు. మేష రాశిలో అప్పటికే రాహువుతో కలిసి సూర్యుడుంటాడు. ఏప్రిల్ 22న గురుడి గోచారం తరువాత మేషరాశిలో గురు, రాహు గ్రహాలుండి గురు చండాల యోగం ఏర్పరుస్తాయి.
కర్కాటక రాశి : ఏప్రిల్ నెల కర్కాటక రాశి జాతకులకు అత్యంత శుభంగా చెప్పవచ్చు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కర్కాటక రాశి జాతకుల్లో ఉద్యోగులకు అంతా బాగుంటుంది. ఈ సమయంలో ఊహించని రీతిలో కొత్త అవకాశాలు లభిస్తాయి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. ఈ క్రమంలో ఆ అవకాశాల్ని అందిపుచ్చుకోగలిగితే విజయం లభిస్తుంది. వ్యాపారంలో కూడా లాభాలు ఆర్జిస్తారు. మహిళలకు ఈ సమయం అత్యంత అనుకూలమే కాకుండా శుభ సూచకంగా ఉంటుంది. జీవితంలో బాగా సంపాదించగలరు.
కుంభ రాశి : గ్రహాల గోచారం ఫలితంగా ఏప్రిల్ నెల అత్యంత శుభసూచకం. మీనరాశి జాతకులకు ప్రత్యేకంగా ఈ గ్రహాల మార్పు ప్రత్యేకంగా మారనుంది. ఈ రాశివారికి ఆర్ధికంగా లాభాలు కలుగుతాయి. కెరీర్లో అద్భుతమైన, ఊహించని వృద్ధి ఉంటుంది. ఆఫీసులో కూడా మీకు పూర్తి అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. అధికారుల సహకారం పూర్తిగా లభిస్తుంది. శాలరీ ఇంక్రిమెంట్ లభిస్తుంది. జీవిత భాగస్వామి సహకారంతో అతి పెద్ద కష్టం తొలగిపోతుంది.
వృషభ రాశి : వృషభరాశి జాతకులకు ఈ సమయంలో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. మీ పనికి గుర్తింపుగా పదోన్నతి లభిస్తుంది. కానీ ముందూ వెనుకా ఆలోచించకుండా ఏవిధమైన అగ్రిమెంట్ లేదా చట్టపరమైన కాగితాలపై సంతకాలు చేయవద్దు. విద్యార్ధులకు అనుకూలమైంది. ఏదైనా కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ధనలాభముంటుంది. అయితే గుడ్డిగా ఎవరినీ నమ్మవద్దు.