వేద జ్యోతిషశాస్త్రం (Vedic Astrology)లో శని లేదా శని గ్రహానికి (Shani or Saturn Planet) చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం చుట్టూ మూడు రింగులు, మల్టిపుల్ శాటిలైట్స్ ఉన్నాయని నిపుణులు విశ్వసిస్తుంటారు. ఇది సౌర వ్యవస్థలో రెండో అతిపెద్ద గ్రహం కాగా ఇది సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి 30 ఏళ్లు పడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడానికి దాదాపు 2.5 ఏళ్ల సమయం పడుతుంది. అయితే జాతకంలో శని ఉంటే వారికి అన్ని విధాల సమస్యలు తప్పవు అంటారు జ్యోతిష్య నిపుణులు. ఈ సమస్యలను ఒక రత్నం (Gemstone) ధరించడం ద్వారా అధిగమించొచ్చు. ఆ రత్నం ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? దాన్ని ఏ రాశి వారు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
శని తన సామాజిక జీవితాన్ని విడిచిపెట్టిన ఒంటరి వ్యక్తి/ గ్రహం అని పరిగణిస్తుంటారు. శని ప్రేమ, కుటుంబం, అనేక ఇతర రిలేషన్ షిప్ లకు మద్దతు ఇవ్వదని నమ్ముతారు. దీని ప్రకారం, ఈ గ్రహం మీ జాతకంలో ఉంటే మీరు మీ కుటుంబ సభ్యులు, ఇతరులతో సంబంధాల పరంగా సమస్యలు ఎదుర్కోవచ్చు. శని జాతకంలో ఉన్నట్లయితే ఫ్యామిలీ లైఫ్ పై నెగిటివ్ ఎఫెక్ట్ పడటమే కాదు వ్యాపారంలోనూ భారీ నష్టాలు తప్పవు. జాతకంలో ఉండే శని దురదృష్టం, బాధ, నిరాశ వంటి వాటికి సూచికగా నిలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)