1. శబరిమలలో మండల పూజ (Sabarimala Mandala Pooja) కొనసాగుతోంది. డిసెంబర్ 27 వరకు మండల పూజ కొనసాగుతుంది. ట్రావెన్కోర్ దేవోసమ్ బోర్డ్ (Travancore Devaswom Board) వర్చువల్ క్యూ టోకెన్ల జారీ చేస్తోంది. అయ్యప్ప భక్తులు https://sabarimalaonline.org/ వెబ్సైట్లో టోకెన్లు బుక్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. వర్చువల్ క్యూ టోకెన్లు బుక్ చేసిన భక్తులకు మాత్రమే దర్శనం లభిస్తుందని ట్రావెన్కోర్ దేవోసమ్ బోర్డ్ గతంలోనే వెల్లడించింది. మరోవైపు కేరళ ప్రభుత్వం శబరిమల అయ్యప్ప భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. పతినెట్టంపాడి చేరుకోవడానికి క్యూ పద్ధతి పాటించాలి. తిరుగు ప్రయాణంలో నడపంతాల్ ఫ్లైఓవర్ ఉపయోగించాలి. దేవస్థానం ఏర్పాటు చేసిన టాయిలెట్స్ మాత్రమే ఉపయోగించాలి. రద్దీని దృష్టిలో పెట్టుకొని పంపా నుంచి సన్నిధానం వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. డోలీ ఉపయోగించేవాళ్లు ట్రావెన్కోర్ దేవోసమ్ బోర్డ్ కౌంటర్లో డబ్బులు చెల్లించి రిసిప్ట్ తీసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఏదైనా సాయం అవసరమైతే పోలీసుల్ని ఆశ్రయించాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లైసెన్స్డ్ ఔట్లెట్స్ నుంచే ఆహారపదార్థాలు కొనాలి. పంపా, సన్నిధానం, ట్రెక్కింగ్ మార్గాలను శుభ్రంగా ఉంచాలి. పార్కింగ్ కోసం కేటాయించిన స్థలంలోనే వాహనాలు నిలపాలి. చెత్తను కుండీల్లోనే వేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. పంపా, సన్నిధానంతో పాటు దారిలో పొగ త్రాగకూడదు. మద్యం, డ్రగ్స్ తీసుకోకూడదు. క్యూలైన్ జంప్ చేయకూడదు. క్యూలో ఉన్నప్పుడు హడావుడిగా ముందుకు వెళ్లకూడదు. ఆయుధాలు, పేలుడు పదార్థాలను తీసుకెళ్లొద్దు. గుర్తింపు లేని వ్యాపారుల నుంచి ఏమీ కొనకూడదు. ఏ సర్వీసుకైనా అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
8. పతినెట్టంపాడిపై కొబ్బరికాయలు కొట్టకూడదు. పతినెట్టంపాడి పరిసరాల్లో నిర్దేశిత స్థలాల్లో తప్ప ఇతర చోట్ల కొబ్బరికాయలు కొట్టకూడదు. పద్దెనిమిది మెట్లను మోకాలిమీద ఎక్కకూడదు. అప్పర్ తిరుమట్టం, తంత్రినాడలో విశ్రాంతి తీసుకోకూడదు. సన్నిధానంలో స్టవ్, కుకింగ్ గ్యాస్ ఉపయోగించకూడదు. మంటలు అంటుకుంటే వెంటనే ఆర్పేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)