Astro Tips: మీ జాతకంలో గ్రహ దోషాలున్నాయా? ఈ మొక్కలు నాటితే ఏ బాధా ఉండదు.. అన్నీ శుభాలే
Astro Tips: మీ జాతకంలో గ్రహ దోషాలున్నాయా? ఈ మొక్కలు నాటితే ఏ బాధా ఉండదు.. అన్నీ శుభాలే
Astro Tips: మీ జాతకంలో ఏవైనా గ్రహ దోషాలున్నాయా? ఇంట్లో అశుభాలు కలుగుతున్నాయా? కొన్ని రకాల మొక్కలు నాటితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గ్రహ దోషాలు తొలగిపోయి.. అన్ని శుభాలే కలుగుతాయి. మరి ఏ రాశుల వారు ఎలాంటి మొక్కలు నాటితే మంచి జరుగుతుందో తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహ దోషాలు మన జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తాయి. గ్రహ దోషాలను తొలగించడానికి అనేక మార్గాలున్నాయి. కొన్ని మొక్కలను నాటితే గ్రహ దోషాలు తొలగిపోతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 14
మేష రాశి (Aries): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఉసిరి చెట్లు నాటడం మేష రాశి వారికి శుభప్రదం. దీని వలన మీ ఆరోగ్యం బాగుంటుంది. గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 14
వృషభ రాశి (Taurus): వృషభ రాశి వారు ఎప్పుడూ నేరెడు, తుమ్మ చెట్లను నాటాలి. ఈ మొక్కలు నాటితో ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి నెలకొంటుంది.(ప్రతీకాత్మక చిత్రం).
4/ 14
మిథున రాశి (Gemini): మిథునరాశిని బుధ గ్రహం పాలిస్తుంది. అందువల్ల ఈ రాశి వారికి వెదురు మొక్కలు నాటడం అత్యంత ఫలప్రదం. జీవితంలో పురోగతి సాధించవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 14
కర్కాటక రాశి (Cancer): కర్కాటక రాశి వారు రావి చెట్టును నాటాలి. కావాలంటే నాగకేసరి మొక్కలు నాటినా అద్భుతంగా ఉంటుంది. ఇవి ఈ రాశులవారికి ఎంతో పవిత్రమైనవి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 14
సింహ రాశి (Leo): సింహ రాశికి సూర్యుడు అధిపతి. ఈ రాశి వారికి మర్రి, మోదుగ చెట్లను నాటడం చాలా శుభప్రదం. ఇవి ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం).
7/ 14
కన్య రాశి (Virgo): కన్యా రాశి వారు మల్లె, మారేడు చెట్లను నాటాలి. ఇది మీ మనస్సును సానుకూలంగా ఉంచుతాయి. పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 14
తుల రాశి (Libra): ఈ రాశి వారు నాగకేసరి మొక్కను నాటాలి. ఇది మీకు జీవితంలో విజయాన్ని అందించగలదు.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 14
వృశ్చిక రాశి (Scorpio): వృశ్చిక రాశి వారికి మోదుగ చెట్టు అత్యంత శుభప్రదం. ఇది కాకుండా ఎరుపు రంగు పువ్వులను ఇచ్చే మొక్కలు కూడా నాటవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం).
10/ 14
ధనస్సు రాశి (Sagittarius): ధనుస్సు రాశి వారు ఆదివారం పనస మొక్కలు నాటాలి. ఇది మీకు చాలా మంచి ఫలితాలనిస్తుంది.జీవితంలో ప్రతి దశలో మీరు విజయాన్ని పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 14
మకర రాశి (Capricorn): మల్లె, వెదురు మొక్కలు నాటడం వల్ల మకరరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఏం చేసినా విజయం దక్కుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
12/ 14
కుంభ రాశి (Aquarius): కుంభ రాశి వారికి చామంతి, కలబంద మొక్కలు శుభప్రదంగా ఉంటాయి. ఈ మొక్కల వల్ల వీరి జీవితాల్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
13/ 14
మీన రాశి (Pisces): మల్లె మొక్క మీన రాశి వారికి కూడా శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఇంట్లో మల్లె పాదులు ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
14/ 14
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)(ప్రతీకాత్మక చిత్రం)