అప్పు చేయడం ఎవరికీ సరదా కాదు. పరిస్థితులు వాళ్లను అప్పుల్లోకి నెట్టేస్తాయి. మీరు కూడా ఇలా అప్పుల బాధల్లో ఉంటే... ఎంత ప్రయత్నిస్తున్నా... అప్పులు తీరకపోతే... మీ ఇళ్లలో వాస్తు దోషం కారణం కావచ్చంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. హిందుత్వంలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వాస్తు దోషాలు తొలగితే... ఇళ్లలో నెగెటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే... డబ్బు రాదు. ఇందుకోసం చిన్న చిన్న మార్పులు చెయ్యాలి. అప్పుడు అప్పుల కష్టాలు తీరిపోతాయంటున్నారు పండితులు.
మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే... ఈశాన్యం దిక్కులో... ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే... దాని పక్కనే ఈశ్యానం వైపు పెడితే చాలు. ఇది మిమ్మల్ని అప్పుల భారం నుంచి బయటపడేస్తుంది. ఇల్లు బరువుగా ఉంటే... అప్పులూ పెరుగుతాయి. అందువల్ల ఇంట్లోని తూర్పు, ఉత్తర దిక్కుల్లో బరువైన వస్తువులు ఏవీ ఉంచకండి.