మేషం :(Aries)మార్చి 21-ఏప్రిల్ 19
మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. దాని ఫలితంగా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఎప్పటి నుంచో పూర్తి చేయాలనుకుంటున్న మీ గోల్ నెరవేరుతుంది. మీతో దూరంగా ఉన్న వాళ్లు, మనస్పర్ధలతో దూరమైన వాళ్లతో తిరిగి స్నేహం చేయడానికి ఇది మంచి రోజు. అదే పెద్ద కార్యక్రమంగా మారే అవకాశం కనిపిస్తోంది.
లక్కీ సైన్- ఒక జామ మొక్క
వృషభం: (Taurus)ఏప్రిల్ 20-మే20
మీరు ఈ రోజు ఎంతో హ్యాపీగా, సరదాగా గడపాలనుకుంటారు. కాకపోతే జీవిత భాగస్వామి మానసికంగా కుంగిపోవడంతో మీరు నిరాశపడతారు. అందుకే ఈరోజు మీ ఆరోగ్యం ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఎవరిపై నమ్మకం పెట్టుకోకుండా ..టైమ్ వేస్ట్ కాకుండా మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. అంతలోనే పరిమితం అవడం ముఖ్యం.
లక్కీ సైన్ - ఉప్పు దీపం
కన్య :(Virgo) ఆగస్టు 23-సెప్టెంబర్ 22
మీకు నచ్చినట్లుగా మీరు నడుచుకోవడం వల్ల మీకు వ్యతిరేకులు తయారవుతారు. మీకు అత్యంత సన్నిహితులే మీ వైఖరిని లెక్క చేయరు. ఈరోజు చేయగలను అనుకునే పనుల గురించి ఓ టాస్క్ లిస్ట్‌ను రూపొందించడానికి ఇదే మంచి రోజు. మీ శక్తిపై మీకున్న నమ్మకం అన్నీ ప్రతికూల అంశాలను జయిస్తారు.
లక్కీ సైన్- మీకు ఇష్టమైన చిత్రం
మకరం:(Capricorn)డిసెంబర్ 22 - జనవరి 19
ఈరోజు కొత్త నిర్ణయాలు, కొత్త పనులు ప్రారంభించాలని అనుకుంటారు. అయితే ఆ ఆలోచన విరమించుకుంటే మంచిది. ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అది ఎంత ముఖ్యమో ఆలోచించే పనిలో ఉంటారు. ఇందులో భిన్నాభిప్రాయాలు ఎదురవుతాయి. అన్నీ విధాలుగా ఇది మంచిరోజే.
లక్కీ సైన్-రంగు రంగుల కండువా