నంబర్ 1 : నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్ 1 వస్తుంది. వాదనలతో దూరం పాటించండి, మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి. ఆస్తిని కొనుగోలు చేయడం కంటే, ఆస్తిని విక్రయించేందుకు ఇది అనుకూల సమయం. సోలార్, రసాయనాలు, సౌందర్య సాధనాలు, బంగారు ఆభరణాలు, పాఠశాలలు, నిర్మాణ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం, పుస్తకాల వ్యాపారం అధిక లాభాలను పొందుతాయి. మీరు ఈరోజు సూర్యాస్తమయానికి ముందే ముఖ్యమైన పనులను పూర్తి చేయాలి.
మాస్టర్ కలర్: పీచ్
లక్కీ డే: ఆదివారం
లక్కీ నంబర్: 1
దానాలు: ఆశ్రమాలకు గోధుమలు దానం చేయాలి
నంబర్ 2 : నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్ 2 ప్రభావం ఉంటుంది. మూన్‌లైట్‌లో పాలు ఉంచి.. వాటిని తాగండి. లీగల్ ఇష్యూస్ సంక్లిష్టంగా మారే సూచనలు ఉన్నాయి. మహిళలు, విద్యార్థులు పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లకు హాజరు కావాలి, పాపులారిటీ పొందాలి. ఎగుమతి దిగుమతి వ్యాపారం, ప్రయాణం, విమానయాన సంస్థలు, క్రీడలు, రిటైల్, వైద్యం, రాజకీయ నాయకులు అభివృద్ధిని సాధిస్తారు.
మాస్టర్ కలర్: స్కై బ్లూ
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్: 2
దానాలు: గుడికి పాలు లేదా నూనె దానం చేయాలి
నంబర్ 3 : నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్ 3 పని చేస్తుంది. మీ లీడర్షిప్కు ప్రశంసలు లభిస్తాయి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ నైపుణ్యాలను చూసి అసూయపడతారు. సాయంత్రం పాల నీటి స్నానం చేయడం ఉత్తమ పరిష్కారం. ఆఫీస్‌లో ప్రమోషన్ లేదా అప్రైజల్ మీకు స్వాగతం పలుకుతుంది. మీ జ్ఞానం, ప్రసంగం ద్వారా ప్రజలను ఆకట్టుకుంటారు. ఈరోజు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రత్యేకంగా విద్యావేత్తలు, సంగీత విద్వాంసులు, బ్యాంకర్లు లేదా రచయితలకు అనుకూలంగా మారతాయి. ప్రేమలో ఉన్నవారు తమ భావాలను విశాల హృదయంతో పంచుకోవాలి. ప్రభుత్వ అధికారులు అన్ని వ్యవహారాలలో అదృష్టాన్ని పొందుతారు. మీ రోజు ప్రారంభించే ముందు మీ గురువు నామాన్ని జపించాలి. నుదిటిపై చందనం పెట్టుకోవడం మర్చిపోవద్దు.
మాస్టర్ కలర్: ఆరెంజ్
లక్కీ డే: గురువారం
లక్కీ నంబర్: 3, 1
దానాలు: పిల్లలకు ఎల్లో పెన్ లేదా పెన్సిల్ దానం చేయాలి
నంబర్ 4 : నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్ 4 ప్రభావం ఉంటుంది. మీ బాస్‌కు మంచి అభిప్రాయాన్ని కలిగించారు, విజయం ఇప్పుడు దగ్గరలోనే ఉంది. విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదు, భవిష్యత్తు కోసం ఈ రోజే చర్యలు ప్రారంభించాలి. ముఖ్యంగా క్రీడలు, రాజకీయాలు, ఎంటర్ట్రైన్మెంట్ రంగాల వారికి ప్రయాణాలు చేపట్టేందుకు ఉత్తమమైన రోజు. నిర్మాణం లేదా స్టాక్ మార్కెట్ వ్యాపారం వృద్ధి, మూవ్మెంట్ చూస్తుంది. అయితే మీడియా, మెటల్, వైద్యం, వ్యవసాయ రంగాలలో కొత్త అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు, మార్కెటింగ్ యువకులు తమ నెలాఖరు లక్ష్యాలను చేధించే అవకాశం ఉంది. దయచేసి ఈ రోజు నాన్ వెజ్ తినడం మానుకోండి.
మాస్టర్ కలర్: బ్లూ
లక్కీ డే: శనివారం
లక్కీ నంబర్: 9
దానాలు: యాచకులకు వస్త్రాలు దానం చేయాలి.
నంబర్ 5 : నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్ 5 పని చేస్తుంది. కొత్త అవకాశాలను తిరస్కరించండి. ప్రస్తుత పనిని కొనసాగించండి. ఇప్పుడు పనితీరుకు గుర్తింపు, ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. పాత స్నేహితుడు లేదా బంధువు సహాయం కోసం వస్తారు. మీరు వారికి సపోర్ట్ అందజేయాలి. బ్యాంకర్లు, క్రీడాకారులు, యాక్టర్లు, రాజకీయ నాయకులు ప్రత్యేక అదృష్టాన్ని ఆస్వాదిస్తారు. సేల్స్, ముఖ్యంగా క్రీడలలో ఉన్నవారికి ఫాస్ట్ మూమెంట్ అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు తమ అకడెమిక్ అఛీవ్మెంట్స్ను ఆనందిస్తారు.
మాస్టర్ కలర్: సీ గ్రీన్
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్: 5
దానాలు: పచ్చని ఆకుకూరగాయలు దానం చేయాలి
నంబర్ 6 : నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్ 6 ప్రభావం కనిపిస్తుంది. మీ సహాయ వైఖరి కారణంగా మీరు మీ సపోర్టర్స్‌ను క్రియేట్ చేసుకుంటారు. అందరికీ ఇష్టమైన వారిగా మారుతారు. కుటుంబ కార్యక్రమాలకు హాజరు కావడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, లవ్ ఫీలింగ్స్ పంచుకోవడానికి, ప్రయాణాలు చేపట్టడానికి, నైపుణ్యాలను ప్రదర్శించడానికి, ప్రెజెంటేషన్లు ఇవ్వడానికి, మాస్ మీడియాను ఎదుర్కోవడానికి, విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అనువైన రోజు. పిల్లలు, జీవిత భాగస్వామితో గడపడానికి గొప్ప రోజు. వీసా కోసం వేచి ఉంటే, తప్పనిసరిగా ఫాలో అప్ చేయాలి. కొత్త ఫ్యాక్టరీని స్థాపించడానికి ప్రయత్నిస్తున్న వారు.. మంచి లొకేషన్‌ను సెలక్ట్ చేసుకుంటారు. నటులు, మీడియా యువకులు విజయాలను ఆస్వాదిస్తారు.
మాస్టర్ కలర్: టేల్
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్: 6
దానాలు: పేదలకు వైట్ స్వీట్స్ అందజేయాలి
నంబర్ 7 : నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్ ప్రభావం ఉంటుంది. మీరు మీ చర్యలకు గొప్ప న్యాయనిర్ణేతగా ఉంటారు, మీరు కష్టపడి పని చేస్తారు, అందువల్ల విజయం మీ చేతుల్లో ఉంది. మీరు ఈరోజు హీరోలుగా ఉంటారు, కాబట్టి వ్యాపారంలో రిస్క్ తీసుకోవాలి. న్యాయ దావాలలో మీ జ్ఞానం, విశ్లేషణ అవసరం. మీ అనుకూల సమయం నడుస్తోంది, క్రీడలు, విద్యా విషయాలలో విజయం సాధ్యమవుతుంది. రిలేషన్ వికసిస్తుంది. ఆపోజిట్ జెండర్ ఈ రోజు మీకు అదృష్టాన్ని పెంచుతుంది. తప్పక గురు మంత్రాన్ని జపించండి. రాజకీయ నాయకులకు అందమైన రోజు అయితే మృదువుగా మాట్లాడటం కీలకం. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని వారికి మీ సేవలను అందించాలని గుర్తుంచుకోండి.
మాస్టర్ కలర్: ఆరెంజ్
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్: 7
దానాలు: ఆశ్రమాలకు గోధుమలు దానం చేయాలి
నంబర్ 8 : నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్ ప్రభావం కనిపిస్తుంది. ఈ రోజు హార్డ్‌వర్క్ అవసరమైన ప్రతిచోటా వివేకం, సమయపాలన కీలక పాత్ర పోషిస్తాయి. డబ్బు వస్తుంది, కానీ కొన్ని అవకతవకలను అనుసరిస్తుంది. బ్రాండ్ ఎంత పెద్దదైతే, అంత గొప్పగా విజయం ఉంటుంది. మీరు ఒక తయారీదారుని ఆశ్రయిస్తే మీ గుడ్‌విల్ సహాయంతో రోజు ముగిసే సమయానికి రివార్డ్ పొందుతారు. మీరు ఉన్నత స్థాయి జ్ఞానాన్ని పొందడంలో ఎక్కువ సమయం వెచ్చిస్తారు. వైద్యులు సేవలందిస్తూ ప్రశంసలు అందుకుంటారు. ప్రజాప్రతినిధులు సాయంత్రం నాటికి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీకు సమయం లేదు, ఫ్యామిలీ గ్యాదెరింగ్స్కు కమిట్మెంట్స్ ఇవ్వడం మానుకోండి.
మాస్టర్ కలర్: సీ బ్లూ
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్: 6
దానాలు: పేదవారికి పుచ్చకాయ దానం చేయాలి
నంబర్ 9:నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. మహిళలు వంటలో తమ క్రియేటివిటీని చూపించి కుటుంబంలో ఐకాన్‌గా మారవచ్చు. ఈ రోజు చప్పట్లు, అభివృద్దితో నిండి ఉంటుంది. అలాగే ఆకస్మిక పెరుగుదల లేదా విజయం అందే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం సంప్రదించడానికి ఒక అందమైన రోజు. క్రీడాకారులు, విద్యార్థులు అద్భుతమైన రోజుగా అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఒక అడుగు ముందుకు వేయాలి. చెఫ్‌లు, మహిళా నటులు, గాయకులు, CA, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, హోటల్ వ్యాపారులు భారీ అదృష్టాన్ని ఆస్వాదిస్తారు.
మాస్టర్ కలర్: రెడ్, ఆరెంజ్
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్: 3, 9
దానాలు: మహిళలకు కాస్మొటిక్స్ దానం చేయాలి.