కొంత మందికి వద్దంటే డబ్బు వస్తూ ఉంటుంది. మరికొంత మంది ఏం చేసినా డబ్బు చేతికి రాదు. ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. నిజమే డబ్బు లేకపోతే ఎంతో ఇబ్బంది. ఎన్నో టెన్షన్లు వచ్చేస్తాయి. అప్పులు చేస్తే వాటికి వడ్డీలు చెల్లించడమే కష్టమైపోతూ ఉంటుంది. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు పండితులు ఓ మార్గం చెప్పారు. అది చాలా తేలిక. అన్ని సమస్యలకూ అది పరిష్కారం చూపిస్తుందని అంటున్నారు. దాన్ని మనస్ఫూర్తిగా చేయాలంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
కుబేరుడు అంటే సంపదకు దేవుడు. మీరు కుబేర స్వామిపై నమ్మకంతో మంత్రాన్ని జపిస్తూ ఉంటే... ఆటోమేటిక్గా ఆర్థిక సమస్యలు తగ్గిపోతూ... చివరకు పూర్తిగా పోతాయట. ఈ మంత్రం జపించేటప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. ఓ వైపు మంత్రాన్ని జపిస్తూ మరోవైపు కుబేరుడికి పూజలు చేయాలని పండితులు సూచిస్తున్నారు. తద్వారా చాలా త్వరగా ఆర్థిక సమస్యలు తొలగుతాయంటున్నారు. ఎందుకంటే ఈ రెండూ చేస్తున్నప్పుడు మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్టుగా అమలవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కుబేర గాయత్రి మంత్రం (Kubera Gayatri Mantra): ఓం యక్ష రాజాయ విద్మయా అలికదేషాయా ధీమహి తన్నా కుబేర ప్రచోదయాత్... మీరు ఈ మంత్రాన్ని మీ మనసులో రోజూ ధ్యానించుకుంటే... కుబేర దేవుడు ఎంతో ఆనందిస్తారు. అలాగే లక్ష్మీదేవి కూడా సంతోషిస్తారు. దాంతో లక్ష్మీ దేవి మీ ఇంటికి వస్తారు. ఈ మంత్రాన్ని రోజూ తప్పనిసరిగా జపించాలి లేదా మనసులో ధ్యానించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
కుబేర మంత్రం జపించే విధానం: పై మంత్రాలను రోజూ కుబేరుడికి పూజల తర్వాత జపించాలని పండితులు చెబుతున్నారు. అందువల్ల వెంటనే ప్రయోజనం పొందే అవకాశాలు పెరుగుతాయి. ఒక్కసారి ఈ మంత్రాన్ని జపించడం ప్రారంభిస్తే... కంటిన్యూగా 21 రోజుల పాటూ రోజూ జపించాలని సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: The information and information given in this article is based on general information. Telugu news18 does not confirm the same. Before implementing these, please contact the concerned expert.)