కన్య (Virgo) కన్యారాశి వారు ప్రయాణ సమయంలో కళాత్మకంగా వ్యవహరిస్తారు. రోజువారీ జీవితంలో విరామం తీసుకోవడానికి వీరికి సమయం కావాలి. ఎల్లప్పుడూ ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే అత్యంత తెలివైన వారిగా పరిగణిస్తారు. వీరు కొత్తదనం కోరుకుంటారు. . ఆమ్స్టర్డామ్, రోమ్, జైసల్మేర్ కన్యారాశికి బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్స్.
వృశ్చికం (Scorpio) వృశ్చిక రాశి వారుఇండిపెండెంట్. ఎవరిపైనా ఆధారపడరు. ఒంటరిగా ప్రయాణించేందుకు ఇష్టపడతారు. ప్రకృతి అంటే చాలా ఇష్టం. అక్కడే ఎక్కువ సమయం గడుపుతారు. సహజంగా ఇతర దేశాల్లోని ప్రాంతాల వైపు ఆకర్షితులవుతారు. జమ్మూ & కాశ్మీర్‌తో పాటు బార్సిలోనా, మాల్దీవుల్లో పర్యటిస్తే వీరికి సంతృప్తికరంగా ఉంటుంది.
కుంభం (Aquarius) ఈ రాశి వారికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఎలాంటి వాతావరణంలోనైనా ఉండగలుకుతారు. చౌకైన హోటల్లోని సోఫాలో లేదా టెంట్లో కూడా నివసించగలరు. ఒకసారి వెళ్లిన ప్రాంతానికి మళ్లీ వెళ్లరు. ఎప్పుడూ కొత్త అనుభూతి కావాలి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లీప్జిగ్, గోవా , బెర్లిన్ తమ అభిరుచులకు తగ్గట్టుగా ఉంటాయి.
మీనం (Pisces) ఇది నీటికి సంబంధించి రాశి అయినందున.. వీరు జీవితంలోని ప్రతి అంశంలో ప్రేమను కనుగొనేందుకు ప్రయత్నిస్తారు. వారు నీటి చుట్టూ ఉన్న ద్వీపాలు, ప్రదేశాలను అన్వేషించడానికి ఇష్టపడతారు. అందమైన తీరాన్ని ఆస్వాదించాలని భావిస్తారు. థాయిలాండ్, మెక్సికో, అండమాన్ నికోబార్ దీవులు వారి అనువైన ఖాళీ గమ్యస్థానాలు.