Astrology Tips : ఈ రోజుల్లో లోన్ తీసుకోని వారు దాదాపు లేరు. ప్రజల దగ్గర డబ్బులు ఉండట్లేదు. దానికి తోడు విపరీతమైన ధరలు పెరగడం, పిల్లల ఎడ్యుకేషన్ ఫీజులు, పెళ్లి పనుల కోసం, ఇంటి నిర్మాణం ఇలా కారణం ఏదైనా దాదాపు అందరం లోన్ తీసుకుంటున్నాం. కానీ వందలో 80 శాతం మంది లోన్ తిరిగి తీర్చలేకపోతున్నారు. లోన్ తీసుకునే రోజును బట్టీ తీర్చగలగడం అనేది ఆధారపడి ఉంటుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
హస్త, మూల, ఆద్ర, జ్యేష్ట, వైశాఖ, కృతిక, ఉత్తరఫాల్గుణి, ఉత్తరాషాడ, ఉత్తర భాద్రపద, రోహిణీ నక్షత్రాల వారు ఆ మూడు రోజుల్లో అప్పు ఇవ్వడం, తీసుకోవడం చెయ్యవద్దని నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా సరే.. ఆదివారం ఎవరికీ అప్పు ఇవ్వొద్దని సూచిస్తున్నారు. తీసుకోకూడని రోజుల్లో లోన్ తీసుకుంటే.. దాన్ని తీర్చడం కష్టం అవ్వడమే కాదు.. రకరకాల అవరోధాలూ, ఆటంకాలూ కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)