మన చుట్టూ ఉన్న చాలా కొద్ది మంది మాత్రమే తమ జీవితంలో నిజమైన ప్రేమను కోరుకుంటారు. ప్రేమ మాధుర్యాన్ని, సున్నితత్వాన్ని అనుభవించే వ్యక్తులు నిష్పత్తిలో చాలా తక్కువ. మన జీవితాల్లో మనకు ప్రత్యేకమైన వ్యక్తి కావాలి, వారు నిరంతరం మనతో ఉంటారు. మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ, కొందరు మాత్రం ప్రేమంటే చాలు ఆమడ దూరం పరుగెత్తుతారు.
కొందరు అంత సులువుగా ప్రేమను దగ్గరకు రానీయరు. తమను ప్రేమించాలని ప్రయత్నిస్తున్న వారిని సైతం సూటిపోటి మాటలతో, వింత వైఖరితో దూరంగా పెడుతుంటారు. కొన్ని రాశుల వారు ప్రేమ కారణంగా అయిన గాయాలతో రిలేషన్‌కు దూరంగా ఉండాలనే నిబంధనలతో మనసు చుట్టూ గోడను నిర్మించుకుంటారు. ప్రేమించడం కష్టంగా ఉన్న కొన్ని రాశిచక్రాల గురించి తెలుసుకోండి.
కన్యా రాశి : అధిక ఆత్మగౌరవం, అన్నీ మాకే తెలుసు అన్న వైఖరి కన్యారాశి వారి ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలతో కన్యా రాశి వారు ఆధిక్య ధోరణి ప్రదర్శిస్తారు. ఎవరి మాట లెక్క చేయరు. దీంతో.. ఇతరుల మనసులు గాయపడే ఛాన్సుంది. అంతేగాక కన్యారాశి వారు ఇతరులను కొంతవరకు తక్కువగా చూస్తారు. ఈ లక్షణాలతో కన్యా రాశి వార్ని ప్రేమించడానికి చాలా మంది ఇష్టపడరు.
ధనుస్సు రాశి : వారు చాలా సున్నితమైన ,భావోద్వేగ స్వభావం కలిగి ఉంటారు. బయటి నుంచి ఏమీ అర్థం కాకపోయినా, వారు తమ భాగస్వామి గురించి ఆందోళన చెందుతారు. బహుశా ఈ కారణంగానే వారు తమ గురించి తాము అసురక్షితంగా భావిస్తారు. తమను తాము ప్రేమకు అనుకూలంగా చూపరు. వారిని ప్రేమించాలని అనుకుంటున్న వారిని, దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నవారిని దూరం పెట్టడానికి పరుష పదాలు, మనసును కష్టపెట్టే పనులు చేస్తుంటారు.
కర్కాటక రాశి : వీరు మొదటి సారి ప్రేమలో పడినప్పుడు, ఏదైనా కారణంతో లవ్ బ్రేకప్ అయితే.. తట్టుకోలేరు. ఈ రాశిలో చాలామంది ఫస్ట్ లవ్ బాధను అధిగమించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. బహుశా అందుకే వారు భవిష్యత్తులో ప్రేమ వైపు వెళ్లడానికి మరింత జాగ్రత్తగా ఉంటారు. తమను ప్రేమించాలనుకుంటున్న వారిని కూడా అంత సులువుగా దగ్గరకు రానీయరు. ఈ చికాకు కలిగించే వైఖరి ఉన్న వారిని ప్రేమించేందుకు చేసే ప్రయత్నం విలువైనదిగానే భావించవచ్చు.
మీన రాశి : వారికి ఏదీ అంత తేలికగా నచ్చదు. ప్రత్యేకంగా, ప్రియమైన వారిని కనుగొనే విషయంలో వారికి అపరిమిత పరిస్థితులు ఉంటాయి. ప్రేమలో దెబ్బతినాల్సి వస్తుందేమోననే ఈ రాశివారు ఎక్కువగా భయపడతారు. తమను తాము రిలేషన్లో ఊహించుకోవడానికి కూడా ఆలోచిస్తారు. తమపై శ్రద్ధ చూపే ఇతరులను హానిగా భావిస్తారు. కాబట్టి మనసు చుట్టూ గోడలు నిర్మించుకుంటారు. డేటింగ్ ప్రక్రియలో కూడా అయిష్టంగా ఉన్నట్లు కనిపిస్తారు. (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)