ప్రతి రాశిచక్రానికి సొంత పాలక గ్రహం ఉంది. ఇది ఆ వ్యక్తి స్వభావం, వృత్తి, ప్రేమ వంటి వాటిని ప్రభావితం చేస్తుంది. గ్రహాల కదలిక బట్టి వారి జీవితాల్లో మార్పులు సంభవిస్తాయి. మీ జాతకంలో గ్రహాలు, రాశులు సానుకూలంగా ఉంటే.. తక్కువ శ్రమతో గొప్ప విజయాన్ని సాధించవచ్చు. ప్రతికూలంగా ఉంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం: సింహ రాశి వారికి ధైర్యం ఎక్కువ. ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ అయ్యారంటే.. అందుకోసం ఏమైనా చేస్తారు. కష్టపడి విజయం సాధిస్తారు. అనుకున్నది నెరవేర్చునే వరకు వదలిపెట్టరు. తన లక్ష్యాన్ని సాధించేందుకు ఎంతకైనా దిగుతాడు. ఈ రాశి వారికి చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ రాశి వారు ఏ రంగంలోకి వెళ్లినా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య: కన్యా రాశి వారి అంకితభావం ఎక్కువ. బాగా కష్టపడతారు. కృషితో కష్టతరమైన లక్ష్యాలను కూడా సాధించగలరు. ఈ రాశి వారికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు వీరు చిన్న చిన్న ఉద్యోగాలును ఇష్టపడరు. పెద్ద ఉద్యోగం చేస్తారు. తరచుగా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత ర్యాంక్‌ను పొందుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
తుల: ఈ రాశి వారికి మొదటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉంటుంది. వారి కష్టార్జితంతో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందుతున్నారు. ఈ రాశికి చెందిన వారు వృత్తిలో తమంతట తాముగా విజయం సాధిస్తారు. కానీ కొన్నిసార్లు కష్టపడి పనిచేసినా వారికి విజయం లభించదు. కాబట్టి వారు ప్రయత్నిస్తూనే ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)