కొంత మందికి ఎంత చిన్న పని అప్పగించినా... అది విజయవంతం కాదు... మరికొందరు... ఎంత పెద్ద పని అయినా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి చూపిస్తారు. కారణం వారిలో ఉన్న నిబద్ధత, తెలివితేటలు, నిగ్రహం, సమయస్ఫూర్తి, ఇతురుల్ని నొప్పించకుండా పని పూర్తి చేయించగలిగే చాతుర్యం వంటి గుణాలు. ఇప్పుడు మనం చెప్పుకునే రాశులవారు భావోద్వేగాలు కలిగిన తెలివైన వారు. వీరికి తమ భావాల్ని అర్థం చేసుకోవడమే కాదు... ఎదుటి వారి ఆలోచనలను కూడా అర్థం చేసుకునే గుణం ఉంటుంది. అలా ఆలోచించగలగడం చాలా అవసరం.
ఎప్పుడూ తన మాటే నెగ్గాలి అనే ధోరణి ఉంటే... ఇతరులు దూరమవుతారు. అలాకాకుండా... అవతలి వారి వెర్షన్ ఏంటో కూడా తెలుసుకుంటే... అప్పుడు విషయంపై సంపూర్ణ అవగాహన వస్తుంది. తదనుగుణంగా సమస్యను పరిష్కరించవచ్చు. రెండువైపులా ఆలోచించేవారు... పరస్థితులను చక్కగా సరిదిద్దగలరు. కొంత మంది అలా ఆలోచించలేరు. తాము చెప్పేదే ఫైనల్ అనే పట్టుదలతో ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే రాశుల వారు అలా ఉండరు. అవసరమైతే ఓ మెట్టు దిగుతారు కూడా. అందుకే వీరి ఎమోషనల్ ఇంటెలిజెన్స్... వీరికి విజయాలు తెచ్చిపెడుతూ ఉంటుంది. మరి ఆ 5 రాశులూ ఏవో తెలుసుకుందాం.
మీన రాశి (Pisces) మీన రాశి వారు నాయకులుగా ఉండే కంపెనీలు, సంస్థలు త్వరగా డెవలప్ అవుతాయి. ఎందుకంటే... ఈ రాశి వారు తమ అభిప్రాయమే కాదు... ఇతరుల అభిప్రాయాన్నీ కచ్చితంగా లెక్కలోకి తీసుకుంటారు. వారు చెప్పేది వింటారు. సహనం ఉంటుంది. వెంటనే ఏ నిర్ణయమూ తీసుకోరు. అన్ని వైపులా బాగా లోతుగా ఆలోచించి... అప్పుడు మాత్రమే ప్రకటన చేస్తారు. ఆ ప్రకటన అందరికీ నచ్చేలా ఉంటుంది. చాలా మెచూర్డ్‌గా ఉంటుంది. దాంతో అందరూ ఆమోదస్తారు. ఇలా ఆలోచించేలా చెయ్యడానికి వీరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ని బాగా ఉపయోగిస్తారు. అది వీరికి ఉన్న ప్రత్యేక బలం.
కర్కాటక రాశి (Cancer) కర్కాటక రాశి వారిలో ఒకరకమైన పిరికితనం ఉంటుంది. అది వీరికి కలిసొస్తుంది. అందుకే వీరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు సిద్ధపడరు. ఎవరైనా సమస్యల్లో ఉన్నప్పుడు వీరు లోతుగా అర్థం చేసుకుంటారు. అంతేగానీ ఒకవైపే ఆలోచిస్తూ... సమస్యను మరింత పెంచరు. ఒక్కోసారి సమస్యల్లో ఉన్నవారిని బయటపడేసేందుకు తమకు మించిన సాహసమే చేస్తారు. సమస్యల్ని పరిష్కరించడంలో వీరిది మరోరకమైన ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సైలెంటుగా పనైపోతుంది. ఇలా చేయడం మిగతా రాశుల వారికి కష్టం.
తుల రాశి (Libra) తులా రాశి వారి ఖాటా ఎలాగైతే బ్యాలెన్స్‌గా ఉంటుందో... అలాగే ఈ రాశి వారు కూడా బ్యాలెన్స్‌తో ఉంటారు. ఏ సమస్య వచ్చినా... ఏటో కటు పడిపోకుండా... రెండువైపులా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తారు. చాలా ప్రాక్టికల్ విధానంలో పరిష్కరిస్తారు. ఎవరికీ అన్యాయం జరగకూడదనే ఆలోచన వీరికి ఉంటుంది. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు... దాన్ని తమ కష్టంగా భావిస్తూ... బాగా ఫీల్ అవుతారు ఈ రాశి వారు. ఫలితంగా ఆ కష్టం నుంచి బయటపడేసేందుకు బాగా శ్రమిస్తారు.
కన్య రాశి (Virgo) కన్యరాశి వారు నిబద్ధతతో ఉంటారు. ముందుకు దూసుకెళ్లేటైపు, హార్డ్ వర్క్ చేస్తారు. వీరికి ఉండే ఎనలిటికల్ ఆలోచనలు మిగతా వారికి ఉండవు. భావోద్వేగ అంశాల్ని వీరు చాలా తేలిగ్గా సెటిల్ చేస్తారు. పెద్దగా ఆలోచించకుండానే పరిష్కారం వచ్చేలా చేస్తారు. వీరికి ఫ్యామిలీతో ఉండటం బాగా ఇష్టం. అందువల్ల కుటుంబ సభ్యులు, బంధువులను ప్రేమిస్తారు. వారి బాధలను తమ బాధలుగా మార్చుకుంటారు. త్వరగా పరిష్కారం అయ్యేలా ఎనలిటికల్ థింకింగ్‌తో ముందుకెళ్తారు.
వృశ్చిక రాశి (Scorpio) చాలా తీవ్రమైన రాశి ఇది. వీళ్ల ప్రవర్తన చాలా చిత్రంగా ఉంటుంది. పైకి ఏమాత్రం ఎమోషన్స్ లేని వారిలా... కఠినంగా ఉన్నట్లు కనిపిస్తారు. లోలోపల మాత్రం ఎమోషన్స్ సముద్రమంత ఉంటాయి. వాటిని వీరు బాగా బ్యాలెన్స్ చెయ్యగలరు. వీరిలో మరో గొప్ప లక్షణమేంటంటే... ఇతరులు చెప్పకపోయినా... వారి మనసులో భావోద్వేగాల్ని ఈజీగా పసిగట్టేస్తారు. వీరు తమకు సాయం చేసేవారికీ, తమను ప్రేమించేవారికీ... వంద శాతం అదే ప్రేమను రిటర్న్ ఇవ్వగలరు. తద్వారా సమస్యలు రాకుండా చేస్తారు. అలాగే తాము ప్రేమించే ఇతరుల నుంచి కూడా అదే వంద శాతం ప్రేమను కోరుకుంటారు. (Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)