ఒంటరితనం అనే భావన కలిగినప్పుడల్లా ఆ భాగస్వామితో తమ భావాలను పంచుకోడానికి ప్రయత్నం చేస్తుంటారు. జ్యోతిష్య శాస్ర్తం ప్రకారం కొన్ని నక్షత్రాల వారు భాగస్వామి లేకుండా ఒంటరి అనే ఆలోచనకే ఆందోళన చెందుతుంటారు. తరచుగా తమకు కాబోయే భాగస్వామి కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఆ లక్షణాలు ఒక రాశులకు ఉంటాయి. అవేంటో చూడండి.
* కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువ. అందుకోసం మరొకరిపై ఆధారపడటానికి చూస్తుంటారు. తమ బలహీనతనలు అధిగమించడానికి, తనకు అండగా నిలిచే అత్యంత నమ్మకమైన వ్యక్తి కోసం చూస్తారు. తెలివితక్కువ నిర్ణయాలు, ఫెయిర్‌గా లేకపోవడం వంటి కారణాలతో ఇబ్బందులకు లోనవుతారు. ఇలాంటి సందర్భాల్లో అనవసరమైన బంధాల్లో చిక్కుకుంటారు.
* మీన రాశి : ఈ రాశి వారు చాలా సౌమ్యులు. ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉంటాయి. బలమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ లేనిపోని ఊహలు, ఆలోచనలతో ఆందోళనకు గురవుతుంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు అవి మరింత ఎక్కువ అవుతుంటాయి. వాటి నుంచి తప్పించుకోడానికి, తమ మనసులోని భావాలను పంచుకోడానికి ఎల్లప్పుడూ ఓ తోడును కోరుకుంటారు. భాగస్వామి తోడు వల్ల ఈ ఇబ్బందికర ఆలోచనల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. అందుకోసం వీరు ప్రేమ బంధంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటారు.
* మకర రాశి : ఈ రాశి వారు కెరీర్, దానికి సంబంధించి గోల్స్ పెట్టుకుంటారు. వాటి కోసం తమకు తామే కఠిన నిర్ణయాలు విధించుకుంటారు. తమ మనసులోని ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. ఈ రకమైన పద్ధతి వల్ల ఒంటరిగా ఉన్నప్పుడు, మరికొన్ని సందర్భాల్లో తీవ్ర నిరాశకు గురవుతారు. దీని నుంచి బయటపడాలంటే కచ్చితంగా ఒక మంచి భాగస్వామి అవసరమని భావించి, రిలేషన్షిప్ కోసం చూస్తుంటారు.
* వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఒంటరిగా జీవించగలమని అనుకుంటారు. ఏదైనా సందర్భంలో అందమైన జంటలను, అన్యోన్యంగా ఉన్న దంపతులను చూసినపుడు తాము ఏదో మిస్ అవుతున్నామనే భావనకు ఎక్కువగా లోనవుతారు. ఆ సందర్భాల్లో వీరు చాలా డిస్ట్రబ్ అవుతారు. ఈ రాశి వారు ఇంట్రావర్ట్స్‌గా ఉంటూ తమ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోరు. అన్ని విషయాలను రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. ఎవరితో చెప్పుకోవాలో తెలియక మనసులోనే మథనపడుతుంటారు. ఈ క్రమంలో ఒంటరితనం నుంచి బయటపడటానికి తమని తాము చక్కదిద్దుకోడానికి రిలేషన్ షిప్ మొదలుపెట్టాలని భావిస్తారు.